Kiara Advani: బికినీ షో.. ఒక‌రిని మించి మ‌రొక‌రు

ABN, Publish Date - May 21 , 2025 | 02:09 PM

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వ‌స్తున్న‌ చిత్రాలు కేవలం యాక్షన్ మరియు సస్పెన్స్‌తోనే కాకుండా, గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.

bikini

బాలీవుడ్ ప్ర‌తిష్టాత్మ‌క య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వ‌స్తున్న‌ చిత్రాలు కేవలం యాక్షన్ మరియు సస్పెన్స్‌తోనే కాకుండా, గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. గ‌తంలో ప‌ఠాన్‌, టైగ‌ర్ సినిమాల‌తో విమ‌ర్శ‌కుల నుంచి దాడులు ఎదుర్కొన్న ఈ సంస్థ ఇప్పుడు రొమాంటిక్ యాంగిల్ విష‌యంలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (Yash Raj Films Spy Universe)లో ఇటీవ‌ల వ‌చ్చిన వార్‌, ప‌ఠాన్ ను మించి రానున్న వార్‌2 విష‌యంలో ఈ వార్త‌లు అధికంగా ఉన్నాయి.

తాజాగా విడుద‌ల చేసిన వార్‌2 టీజ‌ర్‌లో క‌థానాయిక‌గా న‌టిస్తోన్న కియారా అద్వానికి సంబంధించిన బికినీ స‌న్నివేశం రెండు సెక‌న్ల‌లో అలా వ‌చ్చి ఇలా పోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా సీన్ టోట‌ల్ సోష‌ల్ మీడియాను దుమ్ము లేపుతోంది. దీంతో ఇప్పుడు అంతా హీరోయున్ల‌ల‌ను బికీన‌ల‌లో అందంగా చూయించ‌డంలో య‌శ్ రాజ్ ఫిలింస్‌లో (Yash Raj Films)చూయించిన‌ట్టు మ‌రెవ‌రు చూయించ‌లేరంటూ అకాశానికి ఎత్తేస్తున్నారు.

మొద‌ట 2019లో వ‌చ్చిన‌ వార్ సినిమాలో హృతిక్‌కు జోడీగా న‌టించింది వాణీ క‌పూర్. ఆ చిత్రంలో ఒక స్టైలిష్ లొకేషన్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆమెపై చిత్రీక‌రించిన బికినీ సన్నివేశం నాడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వాణీ లుక్ సినిమాకు కొత్త‌ గ్లామర్ తెచ్చిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జ‌రిగింది. అది మ‌రువ‌క ముందే.. 2023లో విడుదలైన ‘పఠాన్’ చిత్రంలో దీపికా పదుకొణె రుబాయ్ అనే పాత్రలో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించగా వారిద్ద‌రిపై షూట్ చేసిన బేషరం రంగ్ పాట పును సంచ‌ల‌న‌మే సృష్టించింది.

పైల్లైన మ‌హిళ అలా బికినీలో న‌టించ‌డ‌మేంటి పైగా కాషాయ రంగు ధ‌రించ‌డ‌మేంటి అంటూ సినిమా బ్యాన్ చేయాల‌నే వ‌ర‌కు వెళ్లింది. ఆ సన్నివేశాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొన్ని సవరణలతో ఈ సన్నివేశాన్ని ఆమోదించింది. ఈ సినిమాలోని పాట‌లో దీపికా బోల్డ్ లుక్ సినిమాకు అదనపు ఆకర్షణను తెచ్చిపెట్టడ‌మే కాక ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించ‌డ‌డంలో కీలక‌ పాత్ర పోషించింది.


ఇక ఇప్పుడు ఈ యూనివ‌ర్స్‌లో వ‌స్తున్న మూడో చిత్రం వార్‌2లో కియారా అద్వానీ (Kiara Advani) సైతం దీపికా(Deepika Padukone), వాణి క‌పూర్ (Vaani Kapoor) త‌ర‌హాలోనే ఇంకా చెప్పాలంటే వాళ్ల‌ను మించి మెటాలిక్ బికినీలో ద‌ర్శ‌ణ‌మిచ్చి ఇప్పుడు టోట‌ల్ ఇండియానే షేక్ చేస్తోంది. వార్‌2 టీజ‌ర్‌లోని ఈ రెండు సెకన్ల సన్నివేశం ఇంటర్నెట్‌లో విప‌రీతంగా వైరల్‌గా మారడంతో గ‌తంలో బికినీలు ధ‌రించిన‌ హీరోయిన్ల లుక్‌ల‌తో పోల్చుతూ కియారా ఫిజిక్‌ను త‌మ‌దైన శైలిలో పొగుడుతూ చిల్ అవుతున్నారు.

ఇప్పుడు ఈ స‌న్నివేశం కూడా సినిమాకు బాగానే క‌లెక్ష‌న్లు కురిపిస్తుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఏక్ థా టైగర్’ (2012) నుంచి ‘టైగర్ 3’ (2023) వరకు, ఈ యూనివర్స్‌లోని చిత్రాలు హీరోయిన్ల బోల్డ్ పాత్ర‌ల విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌క పోతుండ‌డంతో మేక‌ర్స్‌కు కాసుల వ‌ర్షం కురుస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ భారతీయ సినిమాలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోందని అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ సంస్థ నుంచి రాబోతున్న అల్ఫా సినిమాపై కూడా ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డింది. ఈసినిమాలె అలియాభ‌ట్ లీడ్ రోల్ చేస్తుండ‌గా మ‌రో డబ్యూటీ శ‌ర్వ‌రా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాలోన‌ను రొమాంటిక్ స‌న్నివేశాలు బాగానే ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది.

Updated Date - May 21 , 2025 | 02:09 PM