Babil khan: ఇర్ఫాన్‌ తనయుడు కన్నీటి పర్యంతం..

ABN , Publish Date - May 04 , 2025 | 08:35 PM

బాబిల్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌లో ఉండే పరిస్థితులను అతడు ఆ వీడియోల్లో బయటపెట్టాడు.

Babil khan: ఇర్ఫాన్‌ తనయుడు కన్నీటి పర్యంతం..

బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ (Irfan khan) కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బాబిల్‌ ఖాన్‌(Babil khan). ‘ఖాలా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబిల్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌లో ఉండే పరిస్థితులను అతడు ఆ వీడియోల్లో బయటపెట్టాడు. పరిశ్రమకు చెందిన అర్జున్‌ కపూర్‌(Arjun Kapoor), అనన్యపాండే (Ananya panday), షనయా కపూర్‌ వంటి వారి తీరును ఎండగట్టాడు. పని చేయడానికి బాలీవుడ్‌ మంచి ప్రదేశం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అందరితో ఒక విషయాన్ని షేర్‌ చేసుకోవాలనుకుంటున్నా. ఈ పరిశ్రమలో అర్జున్‌, అనన్య, షనయాతో పాటు పరిశ్రమతో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన అర్జిత్‌సింగ్‌ వంటి వారు చాలామంది ఉన్నారు. ఈ ఇండస్ర్టీ ఎంతో అమర్యాదకరంగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను చూసిన వాటిల్లో అత్యంత నకిలీ పరిశ్రమ ఇదే. ఇండస్ర్టీ బాగుండాలని కోరుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారు. నేను మీకు ఎన్నో విషయాలను తెలియజేయాలనుకుంటున్నా’’ అంటూ బాబిల్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి కొద్ది సేపటికి డిలీట్‌ చేశాడు. అంతే కాకుండా, బాలీవుడ్‌ గురించి మాట్లాడిన వీడియోలన్నింటినీ డిలీట్‌ చేసి.. తన ఖాతాను డీయాక్టివేట్‌ చేశాడు. అయితే, అప్పటికే బాబిల్‌ షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌లో అతడిని ఎవరో తీవ్రంగా ఇబ్బంది పెట్టారని.. అందుకే ఇంతలా బాధపడుతున్నాడని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Updated Date - May 04 , 2025 | 08:35 PM