Dharmendra: ధర్మేంద్ర కన్నుమూత.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం!
ABN , Publish Date - Nov 11 , 2025 | 08:50 AM
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూశారు.
బాలీవుడ్ హీమాన్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) మృతి చెందారంటూ మంగళవారం ఉదయం బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్ (esha Deol) ఖండించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తమ కుటుంబం చెప్పేవరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు. ధర్మేంద్రకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇదే విషయంపై ధర్మేంద్ర భార్య హేమ మాలిని (Hema Malini) కూడా ట్వీట్ చేశారు. ఇది క్షమించరాని విషయమని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత గల మీడియా చానెల్స్ ఇలా తప్పుడు వార్తలు ఎలా ప్రచారం చేయగలవు? అంటూ మండిపడ్డారు. ఇది అత్యంత అవమానకరమైన, నిర్లక్ష్యమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. తమ కుటుంబానికి గౌరవం ఇవ్వాలని, గోప్యతను కాపాడాలని కోరారు.