Bollywood: షారుఖ్ కోసం.. దిగొచ్చిన తారాలోకం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:15 PM
షారుఖ్ ఖాన్ కుమారుడి సినిమా వేడుకకు హిందీ పరిశ్రమ నుంచి పెద్దెత్తున అగ్ర నాయికానాయికలు తరలి వచ్చి సందడి చేశారు.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Bads Of Bollywood).
ఈ సినిమా సెప్టెంబర్ 18 ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. ఆ నేపథ్యంలో ఒక రోజు ముందు బాలీవుడ్ సెటబ్రిటీల కోసం ఈ చిత్రం ప్రివ్యూ ప్రదర్శించారు.
ఈ షోకు హిందీ పరిశ్రమ నుంచి అగ్ర నాయికానాయికలు పెద్దెత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా నాటి, నేటి హీరోయిన్లు తీరొక్క వస్త్రధారణతో హజరై అహుతులను మంగ్ర ముగ్దులను చేశారు.
బీ–టౌన్ గ్లామర్ క్వీన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోగా, స్టైలిష్ లుక్స్‌తో వచ్చిన హీరోలు ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించారు.
అంబానీ ఫ్యామిలీ నుంచి స్టార్ చేసి అజయ్ దేవగన్, రణభీర్ కపూర్, బాబీ డియోల్ అంతా ఫ్యామిలీలతో కలిసి వచ్చి ఆ వేడుకకు ప్రత్యేక కళ తీసుకు వచ్చారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.