Sonu Sood: ఇంటి అవరణలోకి పాము.. ఒంటరిగా పట్టిన రియల్ హీరో! వీడియో వైరల్
ABN , Publish Date - Jul 19 , 2025 | 07:56 PM
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood) మరోసారి రియల్ లైఫ్ హీరోగా నిలిచాడు.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood) మరోసారి రియల్ లైఫ్ హీరోగా నిలిచాడు. నిత్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి సాయం చేస్తూ అందరితో మన్ననలు పొందుతూ వస్తున్న ఆయన తాజాగా మూగ జీవాలపై తన వైఖరిని తెలియజేసి శహభాస్ అనిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ అవుతోంది. అందులో సోనూ సూద్ స్వయంగా పామును జాగ్రత్తగా పట్టుకొని అడవిలో వదిలిపెడుతున్న దృశ్యం అందరినీ షాక్ గురి చేసింది.
ముంబైలో తాను నివసించే సోసైటీలోకి అనుకోకుండా ప్రవేశించింది. అక్కడ ఉన్నవారు పామును చూసి భయపడగా, పామును గుర్తించిన సోనూసూద్ వెంటనే దానిని జాగ్రత్తగా పట్టుకుని ఓ సంచిలో బంధించారు. ఇపై దానిని దగ్గరలోని ఆటవీ ప్రాంతంలో వదిలేసి రావాలని తన వద్ద పనిచేసే యువకులకు పురమాయించారు. మీ ఇండ్లలోకి కూడా ఇలానే పాములు వస్తే జాగ్రత్తగా ఉండాలని, వాటిని ఏమీ చెయొద్దని, స్నేక్ క్యాచర్స్ పిలిపించి పట్టించాలని, వాటికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని హతవు తెలిపారు.
ఈ ఈ వీడియోకు ఇప్పుడు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లలో ట్రెండింగ్‌లో ఉంది. కొద్దిగంటల్లోనే లక్షలాది వ్యూస్‌ను రాబట్టింది.అభిమానులు, నెటిజన్లు సోనూ సూద్ ధైర్యాన్ని, జంతువులపై చూపిన ప్రేమను ప్రశంసిస్తున్నారు. రియల్ హీరో, హ్యూమానిటీకి సింబల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి