Bhool Chuk Maaf: థియేటర్‌లో కాదు.. ఓటీటీలోనే.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - May 08 , 2025 | 08:20 PM

బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌, వామికా గబ్బీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భూల్‌ చుక్‌ మాఫ్‌’ (Bhool Chuk Maaf).

బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌(Rajkumar rao), వామికా గబ్బీ (Wamika gabbi)కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భూల్‌ చుక్‌ మాఫ్‌’ (Bhool Chuk Maaf). కరణ్‌ శర్మ దర్శకత్వంలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయడం లేదని టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ‘‘దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేం ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నేరుగా మీ ముందుకు తీసుకువస్తున్నాం. ‘భూల్‌ చుక్‌ మాఫ్‌’ మే 16 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్  కానుంది. ఈ సినిమాను థియేటర్‌లో సెలబ్రేట్‌ చేసుకోవాలని కోరుకున్నాం. కానీ.. దేశ స్ఫూర్తికి మేం మొదటి ప్రాధాన్యం ఇస్తాం. జై హింద్‌’’ అని అన్నారు.

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇటీవల ఈ సినిమాలోని ‘టింగ్‌ లింగ్‌ సజా మే’ అనే పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. బ్యాచిలర్‌ పార్టీ మోడ్‌లో సాగుతున్న ఈ పాటలో రాజ్‌, ధనశ్రీ వారి స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Updated Date - May 08 , 2025 | 08:20 PM