Avika Gor: ఇలాంటి నిర్ణయం నెవర్‌ బీ ఫోర్‌.. అవికా ఏమన్నా ప్లాన్‌ వేసిందా..

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:56 PM

అవికా గోర్ చేసిన ఓ పనికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదని కామెంట్స్‌ పెడుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన పనేంటి

‘చిన్నారి పెళ్ళికూతురు’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్‌ (Avika Gor) . చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరియర్‌ ప్రారంభించి ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకుంది. తదుపరి ఫీచర్‌ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకొని హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడామె చేసిన ఓ పనికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదని కామెంట్స్‌ పెడుతున్నారు. త్వరలో అవికా గోర్‌ కూడా పెళ్లి కూతురు కానుంది. ఆమె పెళ్లి చేసేకోబోయేది నటుణ్ణి కాదు. ఓ వ్యాపారవేత్తను. మిలింద్‌ (Milind Chandwani) చాంద్వానీతో దాదాపు 5 సంవత్సరాలుగా ఆమె ప్రేమలో ఉంది. ఈ ఏడాది జూన్‌లో వీళ్ళిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీన మిలింద్‌తో కలిసి ఏడడుగులు వేయబోతున్నట్లు అవికా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. (Marriage in Pati Patni Aur Panga Show)

Avika.jpg

అయితే ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. తన పెళ్లిని ‘పతి పత్ని ఔర్‌ పంగా’ (Pati Patni Aur Panga) అనే రియాలిటీ షోలో ప్రసారం చేయబోతున్నారు. టీవీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరై, వారి అభిమానాన్ని గెలుచుకున్న ఆమె టీవీ ప్రేక్షకుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  తాను హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షోలో తన ప్రియుడితో ఏడడుగులు వేయబోతున్నాను అంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే జరిగితే ఒక రియాల్టీ షోలో పెళ్లి చేసుకున్న తొలి నటిగా రికార్డ్‌ సృష్టించబోతోంది అంటూ అబిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. సెప్టెంబర్‌ 30వ తేదీన ఈ రియాల్టీ షో లైవ్‌లో అవికా గోర్‌ వివాహం జరగనుంది. ‘ఉయ్యాల.. జంపాల’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ సినిమా చూపిస్త మామ, రాజు గారి గది - 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నటిగానే కాకుండా నిర్మాతగానూ కొనసాగుతుంది. అయితే పెళ్లి తర్వాత టీవీ, సినిమా రంగాల్లో కొరసాగుతుందా లేదా అనేది చూడాలి.  

Updated Date - Sep 23 , 2025 | 01:57 PM