Venice Film Festival: భారతీయ దర్శకురాలికి.. అరుదైన గౌరవం
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:47 AM
82వ వెనిస్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో భారతీయ దర్శకురాలు అనుపర్ణ రాయ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 82వ వెనిస్ అంతర్జాతీయ చిత్రోత్సవం (82nd Venice Film Festival)లో భారతీయ దర్శకురాలు అనుపర్ణ రాయ్‌కు (nuparna Roy) ప్రత్యేక గుర్తింపు లభించింది. సాంగ్స్ ఆఫ్ ఫర్గెటన్ (Songs of Forgotten Trees) చిత్రానికి ఆమె Orizzonti విభాగంలో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్‌ను (Best Director award) గెలుచుకున్నారు. కొత్తగా ఇండీ సినిమాలను ప్రోత్సహించే క్రమంలో ప్రవేశ పెట్టిన విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఇది ప్రత్యేకతను సాధించింది.
ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో ముంబైలో జీవించే ఇద్దరు వలస మహిళల జీవితాలను అత్యంత సహజంగా, భావోద్వేగంగా వారి సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, అందంగా తెరకెక్కించారు. అంతేగాక సమాజంలో నేటి సామాజిక వాస్తవాలను తడుముతూ, మహిళల పోరాటాన్ని చక్కగా చూపించడంపై జ్యూరీ అధ్యక్షురాలు జూలియా డికోర్నో ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు.
ఇతర ముఖ్య అవార్డులు
గోల్డెన్ లయన్ – బెస్ట్ ఫిల్మ్: అమెరికాకు చెందిన సీనియర్ దర్శకుడు జిమ్ జార్ముష్ తన Father Mother Sister Brother చిత్రానికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ అందుకున్నారు. కుటుంబ సంబంధాలు, ఓ తరం మధ్య ఉండే విభేదాలను న్యూజెర్సీ, డబ్లిన్, పారిస్ నేపథ్యంలో చూపించారు.
సిల్వర్ లయన్ – రన్నర్ అప్: ట్యునీషియా దర్శకురాలు కౌతర్ బెన్ హానియా తెరకెక్కించిన The Voice of Hind Rajab సినిమాకు లభించింది. గాజా యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనా యువతి జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన కథ ఇది.
ఉత్తమ నటుడు: ఇటలీకి చెందిన టోని సెర్విల్లో La Grazia సినిమాలో పోషించిన అధ్యక్షుడి పాత్రకు అవార్డ్ అందుకున్నారు.
ఉత్తమ నటి: చైనా స్టార్ సిన్ జిలేయి The Sun Rises On Us All చిత్రంలో తన అద్భుతమైన నటనకు అవార్డు దక్కించుకున్నారు.
మైన్ కంపిటీషన్‌లో బెస్ట్ డైరెక్టర్: బెన్నీ సాఫ్డీ తన The Smashing Machine సినిమాకు అవార్డ్ అందుకున్నారు.
స్పెషల్ జ్యూరీ ప్రైజ్: ఇటలీకి చెందిన జియాన్‌ఫ్రాంకో రోసీ తెరకెక్కించిన Below the Clouds అనే బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంటరీకి ఈ ప్రత్యేక అవార్డ్ లభించింది.