Preity zinta: క్రికెటర్‌తో హగ్.. క్లారిటీ ఇచ్చిన నటి
ABN , Publish Date - May 20 , 2025 | 05:53 PM
క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Surya vanshi) హగ్ చేసుకున్నట్టుగా కనిపించే ఫొటోపై నటి ప్రీతి జింటా (Preity Zinta Hug) ఫైర్ అయ్యారు.
క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Surya vanshi) హగ్ చేసుకున్నట్టుగా కనిపించే ఫొటోపై నటి ప్రీతి జింటా (Preity Zinta Hug) ఫైర్ అయ్యారు. అవన్నీ మార్ఫింగ్ చేసిన ఫొటో అని ఆమె వివరణ ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా మార్ఫింగ్ ఫొటోని ఉపయోగిస్తూఓ వెబ్‌సైట్ వార్త రాయడంపై షాకైనట్లు ఆమె చెప్పారు. ఈ నెల 18న రాజస్థాన్ రాయల్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. (Preity Zinta fire)
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రీతి.. వైభవ్‌ను హగ్ చేసుకున్నారంటూ కొందరు నెట్టింట ఫొటో పోస్టు చేశారు. అదే విషయాన్ని ఓ గుజరాతీ వెబ్‌సైట్ పోస్ట్ చేయగా ప్రీతి రియాక్ట్ అయ్యారు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి.. ప్రత్యర్థి జట్టు సభ్యుడు వైభవ్‌తో అలా ఎందుకు ప్రవర్తిస్తారనే రచ్చ కూడా జరిగింది. ఇదంతా టెక్నాలజీ మాయ అని తేలిపోయింది.