Amitabh bachchan: మహిళలపై నాకున్న గౌరవం అది..

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:23 PM

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని బ్లాగ్‌, ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు .


బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని బ్లాగ్‌, ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు తెలిజయేస్తుంటారు. తరచూ అభిషేక్‌ను (Abhishek Bachan) ప్రశంసిస్తుంటారు. అతని నటనా ప్రతిభ గురించి షేర్‌ చేస్తుంటారు. అయితే ఈ విషయంలో మచ్చన్‌ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కుమారుడిని ప్రశంసించినట్లు జయాబచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ల (Jaya Bachchan and Aishwarya Rai)ఎందుకు ప్రశంసించట్లేదని ఆయన్ను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా ఇదే ప్రశ్నను ఓ అభిమాని అడగ్గా.. బిగ్‌బీ దానికి బదులిచ్చారు.

‘‘అవును నేను అభిషేక్‌ను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయాబచ్చన్‌, కోడలు ఐశ్వర్యను కూడా ప్రశంసిస్తాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటుంటాను. అది నాకు మహిళలపై ఉన్న గౌరవం’’ అని రిప్లై పెట్టారు. అభిషేక్‌కు అందరిపైనా ప్రేమ, గౌరవం ఎక్కువని బిగ్‌బీ అన్నారు. ఇక మరో యూజర్‌ అమితాబ్‌ను జల్సా వద్ద కలవడానికి వచ్చే అభిమానులను అవమానించడానికి ప్రయత్నించగా ఆయన దానికి గట్టిగా సమాధానమిచ్చారు. వారంతా నిరుద్యోగులు, అందుకే జల్సా వద్దకు వచ్చి ఎదురుచూస్తుంటారని ఆ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టగా.. దానిపై అమితాబ్‌ స్పందిస్తూ.. ‘అలాంటప్పుడు మీరు వారికి ఉద్యోగం ఇవ్వండి. అయినా వారు నా ప్రేమలో గొప్ప ఉన్నతోద్యుగులే’ అని స్పందించారు. తాజాగా అభిషేక్‌ నటించిన చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ స్పందనను సొంతం చేసుకుంది. దీనిలో అభిషేక్‌ నటనను ప్రశంసిస్తూ అమితాబ్‌ పోస్ట్‌ పెట్టారు. దీంతోనే కొందరు నెటిజన్లు బచ్చన్‌ను ట్రోల్‌ చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 05:54 PM