Jolly LLB 3: కోర్టులో.. ఇద్దరు జాలీల రచ్చ! ఈ సారి అంతకుమించి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:31 PM
బ్లాక్ కామెడీ కోర్టు రూం డ్రామాగా విశేష ఆదరణ పొందిన జాలీ LLB సినిమాలకు సీక్వెల్‌గా తాజాగా తెరకెక్కిన చిత్రం జాలీ LLB3.
2013, 2017 సంవత్సరాల్లో వచ్చిన బ్లాక్ కామెడీ కోర్టు రూం డ్రామాలుగా వచ్చి విశేష ఆదరణ పొందిన జాలీ LLB సినిమాలకు సీక్వెల్‌గా తాజాగా తెరకెక్కిన చిత్రం జాలీ LLB3 (Jolly LLB 3). మొదటి రెండు భాగాల్లో హీరోలుగా నటించిన అర్షద్ వార్షి (Arshad Warsi ), అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఇద్దరు ఇప్పుడు ఈ చిత్రంలో కలిసి నటించడం విశేషం. సుభాష్ కపూర్ (Subhash Kapoor) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సౌరబ్ శుక్లా (Saurabh Shukla) జడ్జిగా నటిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియో (Fox Star Studios) నిర్మిస్తోంది.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌ను చూస్తుంటే ఇద్దరు లాయర్లు కోర్టు రూంలో చేసే హంగామా, జడ్జి పాట్లు అన్ని రెండు భాగాలను మించేలా ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. వీరు డీల్ చేసే కేసు వివరాలకు సంబంధించి ఎలాంటి డిటెయిల్స్ ఇవ్వక పోయినప్పటికీ వినోదం పంచడం గ్యారంటీ అనేలా టీజర్ సాగింది.