Dhurandhar: 'అఖండ 2' వాయిదా రణ్‌వీర్‌కు కలిసొచ్చింది..

ABN , Publish Date - Dec 06 , 2025 | 09:19 AM

విడుదలకు సిద్ధమై.. చివరి నిమిషంలో బొమ్మ పడకపోవడం అనేది పెద్ద బడ్జెట్‌ సినిమాల విషయంలో అరుదుగా జరుగుతుంటుంది. అదీ స్టార్‌ హీరోల సినిమాలకు ఫైనాన్సియల్‌ ఇష్యూలు ఎదురైతే ఏదో ఒక మ్యాజిక్‌ చేసి విడుదల అయితే చేస్తారు.


విడుదలకు సిద్ధమై.. చివరి నిమిషంలో బొమ్మ పడకపోవడం అనేది పెద్ద బడ్జెట్‌ సినిమాల విషయంలో అరుదుగా జరుగుతుంటుంది. అదీ స్టార్‌ హీరోల సినిమాలకు ఫైనాన్సియల్‌ ఇష్యూలు ఎదురైతే ఏదో ఒక మ్యాజిక్‌ చేసి విడుదల అయితే చేస్తారు. కానీ బాలయ్య (NBK)నటించిన అఖండ 2: తాండవం (Akhanda 2: thandavam) విషయంలో అలా జరగలేదు. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 5న విడుదల కావలసిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ నిర్మాతల పాత బకాయిల ఈష్యూ ఇంత వరకూ తెచ్చింది. ఈ సినిమాకు సమర్పకురాలిగా ఉన్న బాలకృష్ణ తనయ తేజస్వినీ కూడా విడుదల విషయంలో ఎలాంటి స్టెప్‌ తీసుకోలేదు. ఏది ఏమైనా బాలయ్య సినిమా అనుకున్న సమయానికి రాకపోవడంతో అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ‘అఖండ2’ రిలీజ్‌ ఉందని చిన్న చిత్రాలు కూడా విడుదల ప్లాన్‌ చేసుకోలేదు. దాంతో ఈవారం బాక్సాఫీస్‌ సందడి కూడా లేకుండా పోయింది. శర్వా బైకర్‌ కొన్ని కారణాలతో ముందే వాయిదా పడింది. అన్ని షెడ్యూల్‌ ప్రకారం జరిగుంటే ‘అఖండ 2’ సందడి ప్రీమియర్స్‌తో మొదలయ్యేది.

కానీ ఊహించని విధంగా వాయిదా పడింది. అయితే సినిమా వాయిదా బాలీవుడ్‌యుయ సినిమా  ‘దురంధర్‌’కి బాగా కలిసొచ్చింది. నైజాంలో కొన్ని ఏరియాలతో పాటు మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ ధురంధర్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌కి ఎన్నడూ లేని బుకింగ్స్‌ వచ్చాయి.   యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ‘ఉరి’ లాంటి సంచలనమైన సినిమా తీసిన ఆదిత్య ధార్‌ దర్శకుడు. యాక్షన్‌ని ఇష్టపడే ఆడియన్స్‌ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. సినిమాకి డివైడ్‌ టాక్‌ వచ్చినా యాక్షన్‌ని బాగా డీల్‌ చేయడంతో మంచి మార్కులే పడ్డాయి. కథలో ఎమోషన్స్‌ పండి ఉంటే రిజల్డ్‌ ఇంకాస్త మెరుగుగా ఉండేది. ఈ మధ్యకాలంలో రణ్‌వీర్‌ సినిమాలు అంతగా ఆడింది ఏదీ లేదు.  గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది కాస్త డీసెంట్‌గానే ఉందని టాక్‌.  అఖండ వాయిదా కూడా ప్లస్‌ అయ్యింది. వీకెండ్‌ ఏదో సినిమా చూద్దాం అనుకున్న వాళ్లు ఈ సినిమాపై లుక్కేస్తున్నారు.  


Updated Date - Dec 06 , 2025 | 09:27 AM