Ajay Devgn: విమానం లేదు ... అన్ని ఉత్త మాటలే...
ABN , Publish Date - May 01 , 2025 | 07:14 PM
ఇంట్రావర్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడాడు. పలు రూమర్స్ కు క్లారిఫికేషన్ ఇచ్చాడు!
బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn). విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నార్త్ తో పాటు అప్పుడప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తూ తన మార్క్ ను చాటుకుంటున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం 'రైడ్ -2' (Ride 2) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు. ఇక మే డే న విడుదలైన 'రైడ్ 2' లో నటనపరంగా మంచిమార్కులే పడ్డా... సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.
హిందీ చిత్రసీమలో అజయ్ దేవగన్ కు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అయితే సినిమాల సంగతి తప్ప... ఆయన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా బయటకు రాదు. దీంతో ఆయన గురించి అనేక రుమార్స్ బయటకు వస్తుంటాయి. అలాంటి వాటికి తాజా ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పాడు అజయ్. 'మీ వద్ద హాకర్ 800 అనే ప్రైవేట్ జెట్ ఉందని... అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ జెట్‌లోనే కుటుంబంతో విదేశీయాత్రలు చేస్తుంటారనే విషయం నిజమేనా?' అని ఇంటర్వూవర్ అడగ్గా... 'తన దగ్గర ఎలాంటి విమానం లేద'ని క్లారిటీ ఇచ్చాడు అజయ్ దేవ్ గన్. అయితే ఒక జెట్ కొనాలని ప్లాన్ చేశానని.. డీల్ కూడా దాదాపు సెట్ అయింది. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యిందని తెలిపాడు.
ఇక షాహిద్ కపూర్ (Shahid Kapoor) నటించిన 'కబీర్ సింగ్' (Kabir Singh) మూవీలోని టైటిల్ రోల్ ముందుగా అజయ్ దేవగణ్‌కే ఆఫర్ చేశారనే వార్త కూడా గతంలో బాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా అజయ్ దేవ్ గన్ వివరణ ఇచ్చాడు. అస్సలు అలాంటి ప్రపోజల్ ఏదీ తన దగ్గరకు రాలేదని తెలిపాడు. తనకు ఇంటర్వ్యూలు ఇవ్వడమంటే ఇష్టం ఉండదని, తాను ఇంట్రావర్ట్ నని అజయ్ ఒప్పుకున్నాడు.
Also Read: Chiranjeevi: ఒక్కో విషయంలో ఒక్కొక్కరు స్ఫూర్తిగా నిలిచారు...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి