Aishwarya rai bachchan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్‌

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:26 PM

బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్‌ లేకుండా ఫొటోలు, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Aishwarya Rai


బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్‌ లేకుండా ఫొటోలు, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, సంస్థలు, వ్యక్తులు ఐశ్వర్య పేరు, ఫోటోలు ఉపయోగించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని సూచించారు. కొందరు వ్యక్తులు ఐశ్వర్య ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వివిధ మాధ్యమాల్లో ఉపయోగించుకుంటున్నారని ఆమె తరఫు న్యాయవాది సందీప్‌ ేసథి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆమె ఫొటోలను టీ షర్ట్‌పై కూడా ముద్రించి అమ్ముతూ డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అనుమతి లేకుండా ఆమె చిత్రాలను ఉపయోగించుకొనే అధికారం ఎవరికీ ఉండదన్నారు. ఏఐతో ఐశ్వర్య  ఫొటోలను క్రియేట్‌ చేసి యూట్యూబ్‌ ఛానల్స్‌ అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నారని న్యాయస్థానంలో వాదించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 15న జరగనుంది.

గతంలో కూడా ఈ టాపిక్‌పై ఐశ్వర్య స్పందించారు. తన కుమార్తెపై వచ్చిన తప్పుడు కథనాల విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆరాధ్యా బచ్చన్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ‘ఇక లేరు’ అంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేస్తున్న ప్రచారంపైనా ఆమె కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రతి చిన్నారిని గౌరవంగా చూడాలని, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే వార్తల్ని వైరల్‌ చేయడాన్ని చట్టం సహించదని పేర్కొంది. వాటిని తొలగించాలని ఆదేశించింది.

Updated Date - Sep 09 , 2025 | 04:44 PM