Rangeela: రీ రిలీజ్‌ల.. బాట పట్టిన ఆర్జీవీ! ఇప్పుడు శివ.. ఆపై రంగీలా
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:31 PM
రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ సినిమా ‘రంగీలా’ (Rangeela) మళ్లీ థియేటర్లలోకి రానుంది.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో ఆమీర్ ఖాన్ (Aamir Khan), ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ సినిమా ‘రంగీలా’ (Rangeela) మళ్లీ థియేటర్లలోకి రానుంది. 1995లో విడుదలైన ఈ చిత్రం తన అద్భుతమైన మ్యూజిక్, విజువల్స్, కథనంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మరోసారి రీరిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఈ సినిమాలో.. ఆమీర్ ఖాన్ నటన, ఊర్మిళ మతోండ్కర్ గ్లామర్, డ్యాన్స్‌లు, ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ‘రంగీలా రే’, ‘తన్హా తన్హా’ వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరెట్‌గా ఉన్నాయి. ఎక్కడోయోట వినిపిస్తూనే ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ ప్రతిభ, రెహమాన్ సంగీత మాయ, ఊర్మిళ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ సినిమా అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించింది.
అలాంటి ఈ ‘రంగీలా’ చిత్రాన్ని నవంబర్ 28న దేశవ్యాప్తంగా తిరిగి థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా రీరిలీజ్ ట్రైలర్‌నువిడుదల చేశారు. ట్రైలర్‌లో సినిమా ప్రధాన హైలైట్స్‌ను సరికొత్తగా కట్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించేలా ఉంది. ఇదిలాఉంటే.. మరో నాలుగు రోజుల్లో వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘శివ’ కూడా రీరిలీజ్ అవుతుండటంతో ఈ రెండు చిత్రాల వీరాభిమానులు రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలాఉంటే .. వర్మ ఒకదాని తర్వాత మరోటి తన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న వైనాన్ని చూసి వర్మ బాలీవుడ్‌లో తిరిగి తన ప్రాభవం దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు గదా అనే కామెంట్లు వస్తున్నాయి.