Sydney Sweeney: బోల్డ్ బ్యూటీకి.. రూ.530 కోట్ల రెమ్యూనరేషన్? నిజమేనా
ABN , Publish Date - Sep 18 , 2025 | 09:41 AM
హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుండి ఊహించని ఆఫర్. రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన మేకర్స్. నిజమేనా ఈ వార్త? పూర్తి వివరాలు చదవండి.
హాలీవుడ్ (Hollywood) అగ్ర కథానాయిక సిడ్నీ స్వీనీ (Sydney Sweeney) అంటే తెలియని నేటి తరం ఉండదు. తన మార్క్ మసాలాతో కూడిన “యూఫోరియా”, “ఎనీవన్ బట్ యూ” వంటి రొమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నేడు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తుంది. తన నుంచి ఓ సినిమా వస్తుందంటే అత్రుతగా, ఆశగా చూసేవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు.
అలాంటిది అంత పెద్ద స్టార్ా నాయికను ఓ ఇండియన్ సినిమాల్లో నటింపజేసేందుకు ఓ బాలీవుడ్ (Bollywood) బడా నిర్మాణ సంస్థ ప్రయత్నం చేసినట్లు అందుకు గాను అమెకు భారీగా పారితోషకం ఏకంగా రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు రెడీ అయినట్లు ఈ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ముంబై సినీ వర్గాల్లో ఇప్పుడు ఈ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగానే హల్‌చల్ చేస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎక్కడా, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజంగానే ఈ డీల్ ఫైనల్ అయితే, సిడ్నీ స్వీనీ ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న నటిగా రికార్డు సృష్టించనుంది.
ఇదిలాఉంటే.. మనదేశంలో రాజమౌళి మినహా యావత్ దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో రూ. 100 కోట్లు, 200 కోట్ల లోపు ఇంకా చెప్పాలంటే రూ.500 కోట్ల వరకు బడ్జెట్ మాత్రమే పెట్టి సినిమాలు తీశారు. అంతకుమించి ఒక్క రుపాయి కూడా ఎక్కువగా పెట్టి తీసిన వారు తిరిగి బట్ట కట్టిన అనవాళ్లు లేవు.
ఒక వేళ తీసినా.. ఓ పది సినిమాల పెట్టుబడి డబ్బును హీరోకు కాదని హీరోయిన్‌కు ఇచ్చి ఆ రేంజ్‌లో తీసేంత సినిమా ఏమై ఉంటుంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వాటిని నమ్మొద్దని చెబుతూన్నారు. అయితే.. నెట్టింట ప్రచారం జరుగుతన్నంత కాక పోయిన అందులో లాస్ట్ జీరో తీసేసి అమౌంట్ ఆఫర్ చేసి ఉండవచ్చని అది కాస్త ఇక్కడకు వచ్చే సరికి రూ. 530 కోట్లకు చేరిందని అంటున్నారు. ఇంతకు అంత డేరింగ్ నిర్మాత, ఆ బ్యానర్ ఏంటో తెలుసుకొవాలని ఉందంటూ వ్యగ్యాస్త్రాలు సందిస్తున్నారు.