Raja Shivaji: జెనీలియా నిర్మాతగా రాజా శివాజీ... హీరో కమ్ డైరెక్టర్ గా రితేశ్
ABN, Publish Date - May 22 , 2025 | 04:25 PM
భర్త రితేశ్ టైటిల్ పాత్రలో టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా నిర్మిస్తున్న చిత్రం రాజా శివాజీ మూవీ నుంచి మొదటి పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇటీవల మనదేశంలో ఏ సినిమా ఇండస్ట్రీలో చూసుకున్న బయోపిక్‌లు, హిస్టరీ, పిరియాడిక్ సినిమాలపై దృష్టి పెట్టినట్లు ఇటీవల వచ్చిన సినిమాలను బట్టి తెలుస్తుంది. గత రెండు నెలల క్రితం వచ్చిన ఛావా బాలీవుడ్ సినిమా రికార్డులను సైతం తిరగరాసింది. దీంతో ఈ సినిమాల ట్రెండ్ అంతకంతకు పెరుగుతుండడం, ప్రజలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతుండడంతో అయా సినిమాలకు అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో మేకర్స్ సైతం అలాంటి సినిమాలను రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే ఇప్పటికే రిషబ్ షెట్టి హీరోగా శివాజీ చిత్రం ప్రారంభమవగా, ధనుష్ హీరోగా కలామ్, అమమీర్ ఖాన్, జూ. ఎన్టీఆర్‌ల దాదా సాహెబ్ పాల్కే, సల్మాన్ ప్రధాన పాత్రలో కల్నల్ సంతోష్ బాబు వంటి అనేక బయోపిక్‌లు తెర మీదకు వచ్చాయి.
ఇప్పుడు అదే కోవలో మహారాష్ట్ర మాజీ ముఖ్యంత్రి దివంగత విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు, ప్రముఖ బాలీవుడ్ హీరో, టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా (హసిని) భర్త రితేశ్ దేశ్‌ముఖ్ (Riteish Vilasrao Deshmukh). దర్శకుడిగా, నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం రాజా శివాజీ (Raja Shivaji). తాజాగా ఈ సినిమా నుంచి తొలి పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించారు. రితేశ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ (SanjayDutt), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఫర్తీన్ ఖాన్ (Fardeen Khan), మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, జెనీలియా, భాగ్యశ్రీ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. రితేశ్ సతీమణి జెనీలియా (Genelia Deshmukh) నిర్మాతగా వ్యవహారిస్తున్న చిత్రాన్ని మహారాష్ట్ర డే (Maharashtra Day) అయిన మే1, 2026న పాన్ ఇండియా చిత్రంగా మరాఠాతో పాటు, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు.
మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ (Raja Shivaji) సినిమా ప్రస్తుతం ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతుంది. సినిమా పూర్తిగా శివాజీ యవ్వన దశలో నాడు రాజ్యంలో జరిగిన ఘటనలు, స్వరాజ్య స్థాపన కోసం శక్తివంతమైన మొఘలులు ఇతర రాజులతో పోరాడిన సందర్భాలు, పన్నిన సైనిక వ్యూహాలను వివరిస్తూ ఈ చిత్రం రూపొందనుంది. రితీష్ దేశ్‌ముఖ్ (Riteish Vilasrao Deshmukh) ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో, జెనీలియా (Genelia Deshmukh) రాణి సాయిబాయి పాత్రలో నటిస్తున్నారు. అంతేగాక నేషనల్ అవార్డ్ గ్రహీత సంతోష్ శివన్ (Santosh Sivan)సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా అజయ్ అతుల్ (Ajay Atul) సంగీతం అందిస్తునాడు.