Ramya comments: ఎమర్జెన్సీ చూసి కంగనాపై విమర్శలు..
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:59 PM
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ . ఎన్నో వివాదాల నడుమ ఈ చిత్రం ఎట్టకేలకు జనవరిలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నటి, రాజకీయ నాయకురాలు రమ్య తన అభిప్రాయాన్ని తెలిపారు.
కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency movie). ఎన్నో వివాదాల నడుమ ఈ చిత్రం ఎట్టకేలకు జనవరిలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నటి, రాజకీయ నాయకురాలు రమ్య (Actress ramya) తన అభిప్రాయాన్ని తెలిపారు. సినిమా ఏమీ బాలేదంటూ విమర్శలు చేశారు. కంగన మేకింగ్‌ను ఆమె తప్పుపట్టారు.‘
"కంగనారనౌత్ మంచి నటి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ చూశా. చాలా చెత్తగా తీశారు. అందుకే ప్రేక్షకులు కూడా ఆ చిత్రాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కంగన గతంలో ‘మణికర్ణిక’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కంటెంట్ బాగుంది కాబట్టే ప్రేక్షకులు దానిని హిట్ చేశారు’’ అని బెంగళూరు జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె అన్నారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషించడంతోపాటు ఈ సినిమాకు దర్శక, నిర్మాతగానూ వ్యవహరించారు. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించారు. గతేడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడింది. సినిమాలో తమని కించపరిచేలా చూపించారంటూ ఓ వర్గం సెన్సార్‌కు లేఖ రాసింది. దీంతో ఈ సినిమాకు సెన్సార్ రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే జనవరి 17న విడుదలై ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకుంది.