Abhishek Bachchan: విడాకులు రూమర్స్.. అభిషేక్ రియాక్షన్
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:43 PM
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), నటి ఐశ్వర్యారాయ్‌లకు (Aishwarya Rai Bachchan)విడాకులు అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అభిషేక్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), నటి ఐశ్వర్యారాయ్‌లకు (Aishwarya Rai Bachchan)విడాకులు అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అభిషేక్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. సోషల్ మీడియా ప్రచారాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇంటర్‌నెట్‌లో వచ్చే వార్తలు, ప్రచారాలు మాపై ఎలాంటి ప్రభావం చూపించవని ఆయన అన్నారు. ‘‘వర్క్‌కు సంబంధించిన చాలా విషయాల గురించి మా కుటుంబమంతా చర్చించుకుంటాం. అలా అని దానికే ప్రాధాన్యం ఇవ్వం. వేరే విషయాల గురించీ మేము మాట్లాడుకుంటాం. సినీ రంగానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగాను. దానివల్ల ఎలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి, ఎలాంటి విషయాలను వదిలేయాలనే దానిపై నాకంటూ ఒక అవగాహన ఉంది. సోషల్‌మీడియాలో వచ్చే వార్తలు నాపై ఏరకంగానూ ప్రభావం చూపించవు. ఇంకో విషయం ఏమిటంటే.. మా అమ్మ, నా భార్య బయటి ప్రపంచం చేసే వ్యాఖ్యలను మా కుటుంబంలో కి తీసుకురారు. మేమంతా సంతోషంగా జీవిస్తున్నాం’’ అని అన్నారు. (Divorce rumors)
అలాగే ఐశ్వర్యాతో పరిచయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ‘‘1995లో స్విట్జర్లాండ్‌లో ఆమెను మొదటిసారి కలిఽశా. మా నాన్న నటించిన ఓ సినిమా షూట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు.. బాబీ దేవోల్ వల్ల అక్కడ ఐశ్వర్యను కలిశా. బాబీదేవోల్, ఐశ్వర్య ఓ సినిమా షూట్ కోసం వచ్చారు. మేమంతా కలిసి డిన్నర్‌కు వెళ్లాం. ఆ సమయంలో ఆమెతో చాలా విషయాలు మాట్లాడాను. అయితే నా మాటలు తనకు సరిగ్గా అర్థం కాలేదని చాలా కాలం తర్వాత ఆమె నాతో చెప్పింది’’ అని అన్నారు. ‘ఆరాధ్య.. మా కుటుంబ గౌరవం, సంతోషం. ఆమె విషయంలో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. తనొక అద్భుతమైన మహిళగా అభివృద్ధి చెందుతోంది. ఆ క్రెడిట్ పూర్తిగా ఐశ్వర్యకే ఇస్తాను’’ అని అన్నారు.