Abhishek Bachchan: ఐశ్యర్య.. త్యాగాల వళ్లే ఇక్కడ ఉన్నా! ఈ అవార్డు.. వారికి అంకితం
ABN , Publish Date - Oct 14 , 2025 | 09:07 AM
70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అభిషేక్ బచ్చన్ భావోద్వేగానికి గురయ్యారు. తన విజయంలో భార్య ఐశ్వర్య రాయ్, కుమార్తె ఆరాధ్య ప్రధాన పాత్ర వహించారని తెలిపారు.
ఇటీవల జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ వేడుకల్లో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయి మాట్లాడుతూ.. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయ్యింది. ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ స్పీచ్ కోసం చాలా రోజులు సాధన చేశాను.
ఈ సందర్భంలో నా భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నా కలలను సాకారం చేసుకోవడానికి వాళ్లు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ అవార్డు అందుకోవడానికి ఐశ్యర్య (Aishwarya Rai) ప్రధాన కారణం. ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఈ పురస్కారమే అందుకు నిదర్శనం’ అని అన్నారు అభిషేక్ బచ్చన్.
ఇంక ఆయన మాట్లాడుతూ.. ‘ఇది నా కల. నా కుటుంబం ముందు అవార్డును స్వీకరించడం నాకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తోంది. నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. వారిలో ‘ఐ వాంట్ టూ టాక్ దర్శకుడు సూజిత్ సర్కార్ ఒకరు. ఇక నన్ను 25 ఏళ్ళుగా ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ విజయాన్ని నా తండ్రి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కు, నా కుమార్తె ఆరాధ్యకు అంకితం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.