Sitaare Zameen Par Trailer: అమీర్ ఖాన్.. సితారే జ‌మీన్ ఫ‌ర్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది! అంద‌రూ చూడాల్సిన సినిమా

ABN , Publish Date - May 13 , 2025 | 09:12 PM

అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తారే జ‌మీన్ ఫ‌ర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన సినిమా సితారే జ‌మీన్ ఫ‌ర్ ట్రైల‌ర్ మంగ‌ళ‌వారం విడుద‌లైంది.

sitare

అమీర్‌ఖాన్ (Aamir Khan) ప్ర‌ధాన పాత్ర‌లో 2007లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంది క్లాసిక్ చిత్రాల జాబితాలో చేరిన తారే జ‌మీన్ ఫ‌ర్ (Taare Zameen Par) సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన సినిమా సితారే జ‌మీన్ ఫ‌ర్ (Sitaare Zameen Par). మ‌న హాసిని జెనీలియా దేశ్‌ముఖ్ కీల‌క పాత్ర పోషించింది. 2018లో స్పానిష్‌లో వ‌చ్చిన ఛాంపియ‌న్స్ (Champions) మూవీ ఆధారంగా హిందీలో రూపొందించిన‌ ఈ సినిమాకు దివ్య నిధి శ‌ర్మ (Divy Nidhi Sharma) క‌థ అందించ‌గా R. S. ప్ర‌స‌న్న (R. S. Prasanna) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమీర్ ఖాన్ స్వ‌యంగా నిర్మించాడు. జూన్ 20న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Gq1ua6YW0AAzGMa.jpg

ఈ నేప‌థ్యంలో తాజాగా మంగ‌ళ‌వారం రాత్రి ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్‌ చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ఈ సినిమాలో అమీర్ ఖాన్ బాస్కెట్‌బాల్ కోచ్‌గా న‌టించాడు. ఓ రోజు రాత్రి తాగిన‌ మ‌త్తులో రోడ్డుపై పోలీస్ వాహానాన్ని ఢీ కొడ‌తాడు. దీంతో అత‌నిపై కేసు న‌మోదవ‌గా.. కోర్టు మూడు నెల‌లు కొంత‌మంది మాన‌సిక ప‌రిప‌క్వ‌త లేని వారికి గేమ్‌లో శిక్ష‌ణ ఇవ్వాల‌ని తీర్పునిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆ కోచ్ వారికి ఎలా త‌ర్ఫీదు ఇచ్చాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి, వాటిని ఎలా అధిగ‌మించాడు చివ‌కు క‌ప్పు గెలిచారా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో మూవీ ఎమోష‌న‌ల్, కామెడీగా సితారే జ‌మీన్ ఫ‌ర్ (Sitaare Zameen Par) సినిమా ఉండ‌నుంది.

Gq1tKgzWcAAIcAb.jpg

అయితే లాల్ సింగ్ చ‌డ్డా ఫ‌యుల్యూర్ త‌ర్వా చాలా గ్యాప్ తీసుకుని అమీర్ ఖాన్ (Aamir Khan) చేస్తున్న మూవీ అవ‌డంతో ఈ సినిమాపై ప్ర‌పంచ వ్య‌ప్తంగా మంచి అంచ‌నాలే ఉన్నాయి. అదీగాక క్లాసిక్ తారే జ‌మీన్ ఫ‌ర్ సీక్వెల్ అని ప్ర‌చారం ఉండ‌డంతో స‌ర్వ‌త్రా ఈ మూవీ రిలీజ్ కోసం చూస్తున్నారు. మీరు ఇప్ప‌టివ‌ర‌కు ట్రైల‌ర్ చూడ‌కుంటే ఇప్పుడే చూసేయండి మ‌రి.

Updated Date - May 13 , 2025 | 09:12 PM