Aamir khan: లోకేశ్‌తో సినిమా.. రూమర్స్‌కు చెక్‌..

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:17 PM

బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (AAmir khan - తమిళ దర్శకుడు లోకేశ్‌ కనకరాజు (lokesh Kanakarju) కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే.

Aamir khan


బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (AAmir khan - తమిళ దర్శకుడు లోకేశ్‌ కనకరాజు (lokesh Kanakarju) కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయినట్లు రెండ్రోజులుగా రూమర్స్‌ వైరల్‌ అవుతున్నాయి.  ఆమిర్‌తో అనుకున్న కథను మరో హీరోతో తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఆమిర్‌ స్పందించారు.  లోకేశ్‌ కనకరాజుతోనే తన తదుపరి చిత్రం ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఇటీవల లోకేశ్‌ తనతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరలోనే ముంబై వచ్చి పూర్తి స్ర్కిప్టు వినిపిస్తానని చెప్పారు. ఇకపై ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నా’ అన్నారు.

అలాగే వ్యక్తి జీవితానికి సంబంధించిన ఓ విషయంపై ఆయన మాట్లాడారు. ‘నా మాజీ భార్యలు, రీనా, కిరణ్‌ రావు.. ఇద్దరూ మంచి వ్యక్తుఉల. ఇప్పటి మేమంతా ఒకటే కుటుంబంలా ఉంటాం. 60 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడతానని అనుకోలేదు. ఇలాంటి సమయంలో గౌరీ స్ర్పాట్‌ లాంటి వ్యక్తి పరిచయమవ్వడం అదృష్టమని అన్నారు. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ తెరకెక్కించిన ‘కూలీ’లో ఆమిర్‌ఖాన్‌ నటించారు. ఆమిర్‌తో లోకేవ్‌ తీయబోయే సినిమా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని కొన్ని నెలల క్రితం లోకేశ్‌ తెలిపారు.      

Updated Date - Dec 07 , 2025 | 06:23 PM