Year Ender: హిట్ కొట్టినా.. గ్యాప్ లేకపోయినా ఇక్కట్లు తప్పట్లేదు
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:17 PM
టాలీవుడ్‌లో కొంతకాలంగా ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా హిట్ కొట్టిన దర్శకులకే(Tollywood Directors). ఖాళీగా లేకుండా సినిమాలు తీస్తున్న వారికీ ఇదే పరిస్థితి. కథ, నిర్మాత రెడీగా ఉన్నా.. హీరోలు టైమ్ మాత్రం దొరకడం లేదు.
టాలీవుడ్‌లో కొంతకాలంగా ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా హిట్ కొట్టిన దర్శకులకే(Tollywood Directors). ఖాళీగా లేకుండా సినిమాలు తీస్తున్న వారికీ ఇదే పరిస్థితి. కథ, నిర్మాత రెడీగా ఉన్నా.. హీరోలు టైమ్ మాత్రం దొరకడం లేదు. కొంతమంది దర్శకులతే హీరోల చుట్టూ కారు టైర్లు అరిగేలా తిరిగి తిరిగి విసిగిపోతున్నారు. అలా ఏడాది గడిస్తే తయారు చేసుకున్న కథ స్టేల్ అయిపోతుందని ఆ కథను పక్కన పడేస్తున్నారు. తెలుగు హీరోలు సెట్ అవ్వడం లేదని పరభాష హీరోల కోసం ఆశగా చూస్తున్నారు. మన హీరోలు ఏడాదికి ఒక సినిమాకే పరిమితి కావడం వెంటనే లైన్‌లో ఎప్పుడో ఒప్పుకున్న కథ ఉండటం, ఒకొక్కరూ రెండు మూడు కథల్ని సెట్ చేసుకోవడంతో మిగతా దర్శకులు ఖాళీగా ఉండిపోవాల్సి వస్తుంది. (waiting for heros)
‘ఖుషి’ లాంటి హిట్ తర్వాత శివ నిర్వాణ (Shiva NIrvana)కొత్త సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. తన దగ్గర మంచి కథ సిద్ధంగా ఉంది. నిర్మాత కూడా సూట్‌కేస్ తీసుకుని సిద్థమే. అయతే హీరో మాత్రం దొరకడం లేదు. నాగచైతన్యతో ఓ సినిమా చేద్దామనుకున్నాడు శివ. ఆ కథ కూడా చైతూకి నచ్చింది. అయితే పట్టాలెక్కడం ఆలస్యం అవుతోంది. ఈలోగా ఓ హీరోని వెదికి పట్టుకోవాలి. (Year Ender)
ఫ్యామిలీస్టార్ చిత్రం తీసిన పరశురామ్ (Parasuram)పరిస్థితీ ఇదే. ‘ఫ్యామిలీ స్టార్’ విడుదలై ఐదారు అర్ధ సంవత్సరం దాటుతోంది అయినా పరశురామ్ తన తదుపరి చిత్రం అప్‌డేట్ ఇవ్వలేదు. కార్తీతో ఓ సినిమా చేద్దామని ప్రయత్నించాడు. అది కుదర్లేదు. దిల్ రాజు ఇప్పటికే పరశురామ్‌కు అడ్వాన్స్ ఇచ్చేశాడు. హీరో కుదరక.. ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం లేదు.
‘మనమే’ సినిమా తర్వాత శ్రీ రామ్ ఆదిత్య (Sriram Adithya) కూడా ఖాళీగానే ఉన్నారు. కొంతమంది నిర్మాతల దగ్గర శ్రీరామ్ అడ్వాన్సులు తీసుకొన్నాడు. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లాలంటే హీరో కావాలి. ‘మనం’ దెబ్బతో.. శ్రీరామ్‌కు హీరో దొరకడం కష్టమవుతోంది. దానికి తోడు యంగ్ హీరోలంతా బిజీ అయిపోయారు. సురేందర్ రెడ్డిలాంటి (Surendhar reddy)మాస్ డైరెక్టర్ ఖాళీగా ఉన్నాడంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రస్తుతం ఓ బాలీవుడ్ హీరో కోసం అన్వేషిస్తున్నాడు.
వంశీ పైడిపల్లి (vamsi paidipally) కూడా సేమ్. ఆయన్నుంచి వారసుడు సినిమా వచ్చి రెండేళ్లయ్యింది. ఇప్పటికి తన సినిమా ఫైనల్ కాలేదు. తాను కూడా బాలీవుడ్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఈసారి పెద్ద ప్రాజెక్ట్ సెట్ చేసేట్లు ఆయన ప్రయత్నాలు ఉన్నాయి. ‘విరాటపర్వం’ లాంటి మంచి సినిమా ఇచ్చిన వేణు ఉడుగుల (Venu udugula) కూడా హీరో కోసం వెయిటింగ్. తన దగ్గర ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అడ్వాన్సులు ఉన్నాయని టాక్. సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్‌లో ఓ సినిమా చేయాలి. హీరో సెట్ అయితే తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి. దేవరతో హిట్ అందుకున్న కొరటాల శివ (Koratala siva) సైతం ఇప్పుడు ఓ హీరోని వెదుక్కోవాలి. ఆయన చేతిలో ‘దేవర 2’ ఉంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఈలోగా ఆయన సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు.
సీరియర్ దర్శకులు పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల కూడా హీరోల కోసమే ఎదురుచూస్తున్నారు. పూరి దగ్గర ఇన్‌స్టెంట్‌గా కథలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన కొత్త కథతో రెడీ చేసే పనిలో ఉన్నారు. దానికి మాస్ హీరో కావాలి. శ్రీనువైట్ల తన పంథాను పక్కనపెట్టి కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు. ఆ కథ ఓ యంగ్ హీరోకి సెట్ అవుతుందట. గత ఏడాది పెదకాపు చిత్రం తీసిన శ్రీకాంత్ అడ్డాల కూడా పలు కథలతో రెడీగా ఉన్నారు. అక్కడ కూడా హీరో సమస్యే. హీరోలు సై అంటే తప్ప వీళ్ల చిత్రాలు ఓ కొలిక్కి రావు. మరి కొందరు దర్శకులైతే ఫామ్‌లోనే లేక సైలెంట్‌గా ఉన్నారు.