Year Ender 2024: చార్ట్ బస్టర్స్..  దుమ్ము లేపాయి.. హిట్‌ చేశాయి..

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:04 PM

పాటలు సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. అతి తక్కువ సమయంలో జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలన్నా పాట చాలా అవసరం. లిరికల్‌ సాంగ్‌ జనాలకి ఎక్కింది అంటే అది విజువల్‌గా ఎలా ఉంటుందో అనే ఆతురత మొదలవుతుంది.

పాటలు సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. అతి తక్కువ సమయంలో జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలన్నా పాట చాలా అవసరం. లిరికల్‌ సాంగ్‌ జనాలకి ఎక్కింది అంటే అది విజువల్‌గా ఎలా ఉంటుందో అనే ఆతురత మొదలవుతుంది. అలా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, సక్సెస్‌ చేయాలన్నా మూడు నిమిషాల నాలుగు పాటలే సినిమాకు కీలకం. ఈ ఏడాది కూడా జనాల్లోకి దూసుకెళ్ళిన పాటలు, దానిని బట్టి ప్రేక్షకులు అంచనాలు పెంచిన పాటలను చాలానే ఉన్నాయి (chartbuster songs 2024). రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసులో నిలిచినపోయాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..  

పాటతో మడత పెట్టేశారు 

మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’లో (Guntur Kaaram) దమ్‌ మసాలా, కుర్చీ మడత పెట్టి’ పాటలు మాస్‌ని ఓ రేంజ్‌లో ఊపేశాయి. తమన్‌ ఈ రెండూ పాటల్ని మహేష్‌ ఫ్యాన్‌కి నచ్చేలా ఇవ్వగలిగాడు. అలాగే 'హనుమాన్‌’లో పూలమ్మెపిల్లా పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. నాగార్జున 'నా సామిరంగా’లో 'ఎత్తుకెళ్ళాలి’ పాట సినిమా ప్రచారానికి బాగా కలిసొచ్చింది. కీరవాణి బాణీ, చంద్రబోస్‌ సాహిత్యం, రామ్‌ మిర్యాల పాడిన తీరు ప్రత్యేకంగా ప్రేక్షకుల్ని అలరించాయి. సుహాస్‌ 'అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండు’ సినిమాలోని 'గుమ్మా’ సాంగ్‌ యూత్‌ ని బాగా ఎట్రాక్ట్‌ చేసింది. రిజల్ట్‌ మాట పక్కన పెడితే రవితేజ ఈగల్‌ సినిమాలో 'ఆడు మచ్చా’ సాంగ్‌ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా యువతను ఓ ఊపు ఊపింది. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఎనర్జిటి వాయిస్‌  పాటకు ప్లస్‌ అయ్యింది. ప్రభాస్‌ కల్కి లో భైరవ, థీమ్‌ అఫ్‌ 'కల్కి' (kalki) సాంగ్స్‌ పాన్‌ ఇండియాని ఆకర్షించింది. వీటిని పాటల్లా కాకుండా థీమ్స్‌లా కంపోజ్‌ చేసి వదిలారు.


'టిలు స్వ్కేర్'లో  అన్ని పాటలు జనాల్లోకి వెళ్ళాయి. టిక్కేటే కొనకుండా, రాధిక, ఓ మై లిల్లి, టిల్లు రీవ్యాంప్‌ పాటలు యూత్‌, మాస్‌ అందరినీ అలరించాయి. రీల్స్‌లో ప్రతి ఫోన్‌లో సందడి చేశాయి. ఇక ఫ్యామిలీ స్టార్‌ లో 'నందనందన', కళ్యాణి వచ్చా వచ్చా పాటలతు రీల్స్‌లో తెగ తిరిగాయి. 'గ్యాంగ్స్‌ అఫ్‌ గోదావరి'లో సుట్టంలా సూసి పాట వైరల్‌ అయ్యింది. యువన్‌ శంకర్‌ రాజా చాలా గ్యాప్‌ తర్వాత ఓ క్యాచి ట్యూన్‌ ఇచ్చారు.

సౌండ్‌ ట్రాక్‌ దద్దరిల్లిపోయింది(Commitee kurrallu)

గ్రామీణం నేపథ్యంలో తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమాలో 'ఆ రోజులు మళ్ళీరావు’ పాట స్వీట్‌ మెలోడీగా నిలిచింది. డబుల్‌ ఇస్మార్ట్‌ లో స్టెప్పామార్‌, మార్‌ ముంతా పాటలు మాస్‌ ని ఆకట్టుకున్నాయి. మిస్టర్‌ బచ్చన్‌ ఆడియో సూపర్‌ హిట్‌ అయ్యింది. సితార్‌, రెప్పల్‌ డప్పుల్‌, నల్లంచు పాటలు ప్రజల్లోకి దూసుకుపోయాయి.  సరిపోదా శనివారంలో 'భగభగ’ సౌండ్‌ ట్రాక్‌ దద్దరిల్లిపోయింది. సందీప్‌ కిషన్‌ నటించిన 'ఊరు పేరు భైరవకోన’ మ్యూజిక్‌కి మంచి మార్కులు పడ్డాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన 'నిజమేనే చెబుతున్నా’, 'హమ్మ హమ్మా’ పాటలు విపరీతంగా వైరల్‌ అయ్యాయి. శ్రీవిష్ణు 'ఓం భీమ్‌ బుష్‌ ’సినిమాలో సర్‌ ప్రైజింగ్‌ సాంగ్‌ భలే కుదిరింది. అర్జిత్‌ సింగ్‌ పాడిన ‘అణువణువు’ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మెలోడీగా చక్కని ఆదరణ పొందింది. శ్రీవిష్ణు శ్వాగ్‌ సినిమాలో 'నీలో నాలో’ అనే ఓ మంచి రెట్రో మెలోడీ వుంది. జనాల్లోకి వెళ్ళలేదు కానీ వివేక్‌ సాగర్‌ మంచి ఫీల్‌ తో కంపోజ్‌ చేశాడు. లక్కీ భాస్కర్‌లో శ్రీమతి గారు మెల్లగా జనాల్లోకి వెళ్లింది.

చుట్టమల్లే.. పీలింగ్ (Peeling song)

ఈ ఏడాది చార్ట్‌బస్టర్‌ ఆల్బమ్‌ అంటే 'దేవర'. సినిమాలో పాటలన్నీ ఒకదానికి మించి ఒకటి హిట్‌ అయ్యాయి. ఫియర్‌ సాంగ్‌ ఆల్బమ్‌ అంచనాలు పెంచింది. రొమాంటిక్‌ యాంగిల్‌లో విడుదలైన చుట్టమల్లె సాంగ్‌ సినిమాకు ఒక రేంజ్‌లో హైప్‌ తెచ్చింది. దావుది, ఆయుధ, ఆయుధపూజ పాటలు కూడా ఆడియన్స్‌ని విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా ఆయుధపూజ పాటలో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ కి థియేటర్స్‌ లో విజల్స్‌ పడ్డాయి. తారక్‌ ఫ్యాన్స్‌ ని ఖుషి చేసిన ఆల్బం ని కంపోజ్‌ చేశాడు అనిరుద్‌. దేవిశ్రీ ప్రసాద్‌ మరోసారి తన మార్క్‌ చూపించాడు. పుష్ప 2 పాటలతో మ్యాజిక్‌ చేశాడు. దాదాపు అన్నీ పాటలు సూపర్‌హిట్టే. అయితే ప్రతి పాటని పుష్ప 1 తో పోలిక పెట్టడం కాస్త ఇబ్బంది పెట్టింది. పుష్ప టైటిల్‌ సాంగ్‌, సూసేకి, పీలింగ్స్‌ కిసిక్‌ పాటలు మాస్‌ని అలరించాయి. థియేటర్‌లో జాతర పాట సర్‌ ప్రైజ్‌ చేసింది.

ఆరంభం అదిరేలా 
అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో రాబోతున్న సినిమాల మ్యూజిక్‌ జర్నీ మొదలుపెట్టాయి. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 'గేమ్‌ చేంజర్‌'లో (Game Changer) జరగండి, రా మచ్చా, నానా హర్యానా పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన దూప్‌ సాంగ్‌లో చరణ్‌ డ్యాన్సులు ప్రత్యేకంగా నిలిచాయి. సంక్రాంతికి వస్తున్నాం గోదారి గట్టు, మీను మీను పాటలు వైరల్‌ అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల తో  ఈ పాట పాడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగ చైతన్య తండేల్‌ సినిమాలో బుజ్జితల్లి పాట కూడా జనాల్లోకి బాగా వెళ్లింది. 

Updated Date - Dec 28 , 2024 | 04:30 PM