Praneeth hanumanthu: చేసింది తప్పు... క్షమాపణ చెప్పడంలోనూ వ్యంగ్యమే!

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:02 PM

ప్రణీత్‌ హనుమంతు రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ పేరు హల్‌చల్‌ చేస్తోంది. యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా కొంత మంది ప్రేక్షకులకు అతను పరిచయం. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.


ప్రణీత్‌ హనుమంతు రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ పేరు హల్‌చల్‌ చేస్తోంది. యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా కొంత మంది ప్రేక్షకులకు అతను పరిచయం. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నాడు. యూట్యూబ్‌ వేదికగా రోస్ట్‌ వీడియోస్‌ చేస్తూ ప్రణీత్‌ హనుమంతు పేరు తెచ్చుకున్నాడు. అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్‌ చేసిన రీల్‌ మీద తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ... ప్రణీత్‌ హనుమంతు జోక్స్‌ వేశాడు. అతడి స్నేహితులు ఇంకో అడుగు ముందుకేసి నీచమైన కామెంట్స్‌ చేశారు. అతడి వ్యాఖ్యల పట్ల ప్రజలు నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌ మొదటిగా స్పందించి అతని మీద చర్యలు తీసుకోవాలని తెలుగ రాష్ట్రాల  ముఖ్యమంత్రులకు, పోలీస్‌ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్‌ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ - తెలంగాణ డీజీపీలు దీనిపై స్పందించారు. సాయిదుర్గతేజ్‌తోపాటు మంచు మనోజ్‌, నారా రోహిత్‌, విశ్వక్‌ సేన్, నిర్మాత అహితేజ బెల్లంకొండ సైతం ప్రణీత్‌ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు. అతడి మీద చర్య తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Praneeth.jpg

ఇంతకీ ఈ ప్రణీత్ ఎవరు?
ప్రణీత్‌ హనుమంతు తండ్రి పేరు హెచ్‌. అరుణ్‌ కుమార్‌. ఆయనొక ఐఏఎస్‌ అధికారి. 2004 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అని, మొన్నటి వరకు ఏపీలో సివిల్‌ సప్లయిస్‌ అండ్‌ ఈవో సెక్రటరీగా విధులు నిర్వహించారని  సమాచారం.   ప్రణీత్‌ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్‌. అతను స్టైలింగ్‌ టిప్స్‌ ఇస్తూ ఫేమ్‌ తెచ్చుకున్నాడు. ‘ఏ జూడ్‌’ చానల్‌లో అతను కనిపిస్తుంటాడు. ఇక ప్రణీత  సుధీర్‌ బాబు కథానాయకుడిగా వచ్చిన లేటెస్ట్‌ మూవీ ‘హరోం హర’లో  నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్‌ తరహా పాత్ర పోషించాడు. ‘హరోం హర’ కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదల అయిన ఒరిజినల్‌ ఫిల్మ్‌ ‘మై డియర్‌ దొంగ’లో ఫ్రాంక్‌ స్టార్‌గా కనిపించాడు. ‘కీడా కోలా’ విడుదలకు ముందు దర్శక నటుడు తరుణ్‌ భాస్కర్‌ చేసిన ప్రమోషనల్‌ వీడియోలో  కామెడీ కింగ్‌ బ్రహ్మానందం గెటప్స్‌ రీ క్రియేట్‌ చేశారు. ఆ వీడియో వెనుక సృష్టికర్త ప్రణీత్‌ హనుమంతే. అతను కొన్ని సినిమాల విడుదలకు ముందు ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు చేశాడు. ‘హాయ్‌ నాన్న’ విడుదలకు ముందు నానితో, ‘భజే వాయు వేగం’ విడుదల సమయంలో కార్తికేయ గుమ్మకొండతో ప్రణీత్‌ హనుమంతు స్పెషల్‌ వీడియోలు చేశాడు. హ్యూమర్‌ కోసం అతడి వీడియోస్‌ చూసే  కొందరు ఆడియన్స్‌ సైతం తండ్రీ కుమార్తె బంధం మీద చేసిన వీడియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఫ్యామిలీ మీద కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం  చేయడంతో ప్రణీత్‌ హనుమంతు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనను తాను సమర్థించుకుంటూ డార్క్‌ హ్యూమర్‌ అని పేర్కొనడం పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  

Updated Date - Jul 08 , 2024 | 04:24 PM