మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Venkatesh Daughter: ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం.. ఫొటోలు వైరల్

ABN, Publish Date - Mar 16 , 2024 | 09:07 AM

వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్‏తో ఘనంగా జరిగింది. నార్సింగిలోని ది అడ్రస్‌ కన్వెన్షన్ సెంటర్‌ నందు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు వెంకటేశ్ కుమార్తె వివాహం జరిగింది.

Venkatesh Second Daughter Hayavahini Marriage Pic

విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని (Hayavahini) వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్ (Nishanth)‏తో ఘనంగా జరిగింది. నార్సింగిలోని ది అడ్రస్‌ కన్వెన్షన్ సెంటర్‌ నందు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు వెంకటేశ్ కుమార్తె వివాహం జరిగింది. (Hayavahini Weds Nishanth)

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబసభ్యులు సందడి చేసిన సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత.. ఆయన కూతురు సితార మెహందీ వేడుకలలో పాల్గొన్నారు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. (Daggubati Family Marriage)


ముఖ్యంగా నూతన జంట హవ్యవాహిని, నిషాంత్‌ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో వెంకటేష్ కుమార్తె హవ్యవాహిని ఎటువంటి హడావుడి లేకుండా.. ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫొటోలను వైరల్ చేస్తున్నారు. (Hayavahini and Nishanth Wedding Photos)


ఇవి కూడా చదవండి:

====================

*Bramayugam: ఓటీటీలోకి వచ్చేసిన మెగాస్టార్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రం

**************************

*Hanuman OTT: ఏందయ్యా ఇది.. ఈ ఊరించడమేంటి? ఇంట్రెస్ట్ పోతోంది..

****************************

*Ritika Singh: తలైవర్‌కు ఎప్పటికీ రుణపడివుంటా..

*******************************

Updated Date - Mar 16 , 2024 | 12:16 PM