Sireesha: తెలుగు సీరియ‌ల్ న‌టి శిరీష విడాకులు.. కంట్రోల్ చేసుకోలేక‌పోయామ‌ని పోస్ట్

ABN , Publish Date - May 17 , 2024 | 11:38 AM

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో జంట విడాకులు తీసుకుంది. తాజాగా తెలుగు టీవీ సీరియ‌ల్ మ‌న‌సు మ‌మ‌త ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టి దామెర శిరీష త‌న భ‌ర్త న‌వీన్ నుంచి విడాకులు తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Sireesha: తెలుగు సీరియ‌ల్ న‌టి శిరీష విడాకులు.. కంట్రోల్ చేసుకోలేక‌పోయామ‌ని పోస్ట్
Actress Sireesha Damera

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో జంట విడాకులు తీసుకుంది. నిన్నా మొన్న హీరో ధ‌నుష్ జంట‌, సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాష్‌ జంట విడాకుల వ్య‌హారాలు సౌత్‌లో హాట్ టాపిక్‌గా న‌డుస్తుండ‌గా తాజాగా తెలుగు టీవీ ఇండ‌స్ట్రీలో ఓ న‌టి విడాకులు తీసుకుంది. మ‌న‌సు మ‌మ‌త సీరియ‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టి దామెర శిరీష (Sireesha Damera) త‌న భ‌ర్త న‌వీన్ నుంచి విడాకులు తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

443734895_18326023552123705_734049769895675385_n.jpg

ఈ మేర‌కు శిరీష (Sireesha Damera) త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విష‌యాన్ని తెలుపుతూ ఓ లెట‌ర్ పోస్టు చేసింది. మేము కంట్రోల్ చేసుకోలేని, దిద్దుకోలేని ప‌రిస్థితుల్లో విడాకులు తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించింది. న‌వీన్‌పై నాకు ఇప్ప‌టికీ మంచి గౌర‌వం ఉంద‌ని, నాకు మీ అంద‌రి మ‌ద్ద‌తు కావాల‌ని ద‌య‌చేసి మాపై ఎలాంటి ట్రోలింగ్‌, విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని, మీ స‌పోర్ట్‌కు చాలా థ్యాంక్స్ అని తెలిపింది.

436799464_18321195892123705_6598957435432392374_n.jpg


మొద‌ట‌గా మొగలిరేకులు సీరియ‌ల్‌తో వెలుగులోకి వ‌చ్చిన శిరీష (Sireesha Damera) ఆ త‌ర్వాత వ‌రుసగా అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. రాముల‌మ్మ‌, మ‌న‌సు మ‌మ‌త‌, స్వాతి చినుకులు, నాతిచ‌రామి వంటి పేరు పొందిన సీరియ‌ల్స్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించింది.

Capture.JPG

సిరిసిల్ల‌కు చెందిన శిరీష‌కు ర‌జిత‌, సౌజ‌న్య అనే సిస్ట‌ర్స్ ఉండ‌గా వారిద్ద‌రూ కూడా సీర‌య‌ల్్ న‌టులే కావ‌డం గ‌మ‌నార్హం. శిరీషాకు ఓ కుమారుడు సంతానం కాగా ప్ర‌స్తుతం Siri's World పేర యూ ట్యూబ్ ఛాన‌ల్‌ను ర‌న్ చేస్తూ టాప్ యూట్యూబ‌ర్‌గా పేరు తెచ్చుకుంది.

438036701_18322172479123705_4016036626423925188_n.jpg

Updated Date - May 17 , 2024 | 11:40 AM