Upcoming movies: ఈవారంలో థియేటర్‌ సందడి చేసే చిత్రాలివే! 

ABN , Publish Date - Jan 22 , 2024 | 04:00 PM

సంక్రాంతి సందడి పూర్తయింది. బడా చిత్రాలతో బాక్సాఫీస్‌ కళకళలాడింది ఇప్పుడు రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని సినీ ప్రియులను అలరించడానికి మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి.

Upcoming movies: ఈవారంలో థియేటర్‌ సందడి చేసే చిత్రాలివే! 

సంక్రాంతి సందడి పూర్తయింది. బడా చిత్రాలతో బాక్సాఫీస్‌ కళకళలాడింది ఇప్పుడు రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని సినీ ప్రియులను అలరించడానికి మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్థమవుతున్నాయి. మరి ఆ చిత్రాలు, సిరీస్‌లు ఏంటో చూద్దాం. 

movies (1).jpeg

హృతిక్‌ ‘ఫైటర్‌’ (Fither)

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఫైటర్‌’. సిద్థార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. భాిరతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్థ విమాన పైలట్‌గా హృతిక్‌ కనిపించనున్నాడు. ఈ నెల 25న థియేటర్స్‌లో విడుదల కానుందీ సినిమా. 

movies (2).jpeg

ఓటమెరుగని రెజ్లర్‌ (Malaikottai Vaaliban)

డిఫరెంట్‌ కథలు, వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుండే నటుడు మోహన్‌లాల్‌.  ఆయన కీలక పాత్రలో లిజో జోస్‌ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్‌ డ్రామా ‘మలైకోటై వాలిబన్‌’. ఇందులో మోహన్‌లాల్‌  ఓటమెరుగని రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో కనిపించనున్నారు.  బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ చిత్రానికి  సీక్వెల్‌ను కూడా చిత్ర బృందం సిద్థం చేస్తోంది.

movies (4).jpeg

అనువాద చిత్రాలు.. అక్కడ హిట్‌.. మరి ఇక్కడ..

ధనుష్‌  కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌కిషన్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రధారులు. జి.శరవణన్‌, సాయి సిద్థార్థ్‌ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఇందులో ధనుష్‌ తిరుగుబాటు నాయకుడిగా కనిపించారు. ఈ నెల 25న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

movies (3).jpeg

శివ కార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘అయలాన్‌’. సంక్రాంతికి తమిళంలో సందడి చేసిన చిత్రమిది.  ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్‌ వద్ద వరుస సినిమాలు సందడి చేయడంతో ‘అయలాన్‌’ వాయిదా పడింది. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న తెలుగు ప్రేక్షుల ముందుకు రానుంది. 

movies (5).jpeg

ప్రయోగాత్మక చిత్రంతో హన్సిక

ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. హన్సిక ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానుంది. వీటితోపాటు ‘మూడో కన్ను’,బిఫోర్‌ మ్యారేజ్‌’, ‘ప్రేమలో..,  ‘రామ్‌: రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌’, ‘ తదిర చిత్రాలు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. 


Updated Date - Jan 22 , 2024 | 04:00 PM