'గుంటూరు కారం' లో రమణగాడి ఇంటి కోసం ఖర్చు ఎంతయిందో తెలుసా...

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:42 AM

'గుంటూరు కారం' లో మహేష్ బాబు పాత్ర పేరు రమణ, మిరపకాయల వ్యాపారం చేసే అతని ఇల్లు గుంటూరులో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఇంటి కోసం అయిన ఖర్చు, అది ఎక్కడ వేశారు, ఆ వివరాలు తెలుసుకోండి.

'గుంటూరు కారం' లో రమణగాడి ఇంటి కోసం ఖర్చు ఎంతయిందో తెలుసా...

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినా, వసూళ్ళలో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతోంది. కుటుంబ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి ఎక్కువ స్పందన వస్తోంది, ఈ సినిమాలో మహేష్ బాబు చేసిన రమణగాడి పాత్రకి అందరూ ఈలలు, గోలలు వేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. (The House set in Guntur Kaaram costs nearly Rs 10 crore)

gunturkaaramhouseset.jpg

ఈ సినిమాకి పెట్టుబడి కూడా బాగా పెట్టారన్న విషయం కూడా తెలిసిన విషయమే. ఈ సినిమాలో రమణ గాడి ఇల్లు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ చాలామంది మనుషులతో సందడిగా ఉంటుంది, దానికితోడు రమణ గాడు గుంటూరులో మిరపకాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు కాబట్టి, ఇంకా ఎక్కువ సందడి ఉంటుంది. మరి ఈ రమణగాడి ఇల్లు ప్రత్యేకంగా తయారు చెయ్యాలి కదా, అందుకని హైదరాబాదు శివార్లలో ఈ ఇంటికోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా. సుమారు రూ. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఇంటిని తయారు చేశారు. శంకరపల్లి, కోకాపేట మధ్యలో ఒకచోట ఈ ఇంటిని కట్టారు.

gunturkaaramhouse.jpg

ఈ ఇంటి నిర్మాణంలో పనిచేసిన సాయి గోలికిరణ్ అనే అతను ఈ ఇంటిని, ఈ ఇంటిని ఎలా కట్టారు అనే విషయం తన సామజిక మాధ్యమం అయినా 'ఎక్స్' లో పెట్టారు. ఇల్లు కట్టక ముందు అక్కడ పిచ్చి మొక్కలు అవీ పెరిగి ఉంటే, వాటిని తీసేసి ఈ ఇల్లు కట్టాము అని చెప్పారు. అసలు ఎవరూ ఊహించి వుండరు అక్కడ ఇంతటి బ్రహ్మాండమైన ఇల్లు వస్తుంది అని అతను చెప్పారు. సుమారు 18 వేల చదరపు అడుగుల్లో ఈ ఇంటిని కట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి ఆర్ట్ దర్శకుడిగా ఎంతో అనుభవం వున్న ఏఎస్ ప్రకాష్ పని చేశారు.

Updated Date - Jan 18 , 2024 | 11:42 AM