Tamannaah Bhatia: 'యానిమల్' విజయోత్సవ వేడుకలో తమన్నా ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:32 AM

తమన్నా భాటియా ఫోటోలు మరోసారి వైరల్ అవుతూ వున్నాయి. ఆమె 'యానిమల్' సినిమా విజయోత్సవ వేడుకకి ప్రత్యేక అతిధిగా హాజరయినప్పుడు తీసిన ఫోటోలు సామజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వున్నాయి. ఎందుకంటే...

Tamannaah Bhatia: 'యానిమల్' విజయోత్సవ వేడుకలో తమన్నా ఫోటోస్ వైరల్
Tamannaah Bhatia

అటు హిందీలోనూ, ఇటు దక్షిణాదిలోనూ అగ్రనటులతో సినిమాలు చేస్తూ బాగా బిజీగా వుండే నటీమణుల్లో తమన్నా భాటియా (Tamannaah Bhatia photos are going viral) ఒకరు. గత సంవత్సరం 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సినిమాలో ఒక బోల్డ్ పాత్రలో కనిపించి అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు తమన్నా. అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా సహచర నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో వున్నాను అని ఎటువంటి అరమరికలు లేకుండా అభిమానులతో పంచుకున్నారు.

tamannaahveryhot.jpg

గత సంవత్సరం రజినీకాంత్ నటించిన 'జైలర్' లో తమన్నా కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించడమే కాకుండా అందులో 'నువ్వు కావాలయ్యా, కావాలి' అనే పాటలో తళుక్కున మెరిశారు కూడా. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో, వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.

tamannahglamour.jpg

అలాగే చిరంజీవితో 'భోళా శంకర్' లో కూడా తమన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమా అంతగా ఆడకపోయినా, ఇందులోని పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే గత సంవత్సరం తమన్నా ఒక మలయాళం సినిమా 'బాంద్రా' లో కూడా నటించారు. ఆమె మొదటిసారిగా ఈ సినిమాతో ఒక మలయాళం సినిమాలో నటించడం జరిగింది.

tamannahhotpic.jpg

తమన్నా సినిమాలోనే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే చేస్తున్నారు. గత సంవత్సరం 'జీ ఖర్దా' అనే వెబ్ సిరీస్ లో ఇంకో బోల్డ్ పాత్రలో కనిపించారు. అలాగే 'ఆఖరి సచ్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించారు తమన్నా.

tamannaahveryhotphoto.jpg

ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన తమన్నా ఫోటోలో వైరల్ అవుతూ కనిపిస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఆమె ఫోటోస్ వైరల్ అవుతున్నాయి అంటే ఆమె 'యానిమల్' #Animal సినిమా విజయోత్సవ సభకి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన ఈ 'యానిమల్' సినిమాకి సందీప్ వంగా దర్శకుడు.

tamannaahveryhotphotos.jpg

ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అందుకని ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ముంబైలో జరిగినప్పుడు తమన్నా హాజరయినప్పుడు తీసిన ఆమె ఫోటోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jan 09 , 2024 | 12:07 PM