Tamannaah Bhatia: అదే పెద్ద సవాల్‌.. ఆ రెండూ ఈ జర్నీలో ఉన్నాయి!

ABN, Publish Date - Jul 13 , 2024 | 10:16 AM

రీల్స్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఇదొక హాబీగా మారిందని ఆమె అంటున్నారు. ‘పదిహేను సెకన్ల రీల్స్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్న వ్యక్తుల దృష్టిని ఆకర్షించడమే ఇప్పుడు నటీనటులకు అతిపెద్ద సవాల్‌గా మారిందని  అన్నారు.

Tamannaah Bhatia: అదే పెద్ద సవాల్‌.. ఆ రెండూ ఈ జర్నీలో ఉన్నాయి!

రీల్స్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia). ప్రస్తుతం ఇదొక హాబీగా మారిందని ఆమె అంటున్నారు. ‘పదిహేను సెకన్ల రీల్స్‌ (Reels craze) చూస్తూ కాలక్షేపం చేస్తున్న వ్యక్తుల దృష్టిని ఆకర్షించడమే ఇప్పుడు నటీనటులకు అతిపెద్ద సవాల్‌గా మారిందని  అన్నారు. సినిమాల్లో ప్రత్యేక పాటలు, భిన్నమైన జానర్‌ కథలు, వెబ్‌ సిరీస్‌లతో   ప్రేక్షకులను అలరిస్తున్నారు తమన్నా. కాలం మారింది మనం కూడా మారాలంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘ఒకప్పుడు థియేటర్స్‌లోనే సినిమాల హవా ఉండేది. ఇప్పుడు కాలం మారి ఓటీటీలో (OTT) అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీ వేదికగా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వాటివైపే కొందరు ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. కేవలం ఓటీటీ ప్రాజెక్టులే కాదు.. సామాజిక మాధ్యమాల వేదికగా సందడి చేస్తున్న పదిహేను సెకన్ల రీల్స్‌ కూడా ఆకర్షిస్తున్నాయి. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు, వారికి నచ్చిన కథల్ని తెరపైకి తీసుకురావడమే నాయకానాయికలకు సవాల్‌గా మారింది. ఆ రీల్స్ పెద్ద పోటీగా నిలిచాయి’ అని తమన్నా అన్నారు. (Tamannaah Bhatia Life journey)

Tams.jpg
తన జర్నీ గురించి మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచే నటిని కావాలనుకున్నా. ఆ కలను నెరవేర్చుకోవటానికి తీసుకున్న నిర్ణయాలు నన్ను ఎక్కడిదాకా తీసుకెళ్తాయనేది తెలియకుండానే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టా. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. నటిని కావాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. సినీతారగా ఎదగాలన్న కల కోసం వందశాతం కష్టపడి పనిచేశా. అనుకున్నది సాధించానన్న ఆనందం, సంతృప్తి రెండూ నా ఈ ప్రయాణంలో ఉన్నాయి’ అని చెప్పారు.

Updated Date - Jul 13 , 2024 | 10:16 AM