తిరుమలేశునికి నటి సురేఖావాణి తలనీలాలు ఇచ్చేసారు

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:57 PM

నటి సురేఖ వాణి తిరుమల వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని తల నీలాలు సమర్పించారు. జుట్టులేకుండా వున్న ఆమె తిరుమలలో సందడి చేస్తూ, మీడియా వాళ్ళకి కూడా ఫోటోలకి ఫోజులిచ్చారు. ఆమె కుమార్తె సుప్రిత కూడా ఆమె వెంట వున్నారు.

తిరుమలేశునికి నటి సురేఖావాణి తలనీలాలు ఇచ్చేసారు
Actress Surekha Vani with her daughter Suprita in Tirumala

సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రిత ఇద్దరూ ఎప్పుడూ కలిసే కనపడుతూ వుంటారు, కొన్ని సార్లు కలిసి రీల్స్ కూడా చేస్తూ వుంటారు. గత రెండు రోజులుగా సురేఖావాణి తన సామజిక మాధ్యమంలో తాను, కుమార్తె సుప్రీత తిరుపతి వెళుతున్నట్టుగా ఫోటోస్ పెట్టారు. అలాగే తిరుపతి వెళ్లిన తరువాత నడక మార్గంలో తిరుపతి కొండ ఎక్కుతున్నట్టుగా కూడా కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. ఆమె ఏమి పని చేసినా వెంటనే తన అభిమానులతో పంచుకుంటూ వుంటారు.

surekhavanidaughtersuprita.jpg

అయితే తిరుపతి వెళ్లిన సురేఖావాణి ఈరోజు తన తల నీలాలు ఆ తిరుమలేశునికి సమర్పించుకున్నారు. దర్శనం చేసుకొని బయటకి వచ్చాక అక్కడ సెలబ్రిటీ పాయింట్ దగ్గర సురేఖా వాణి, తన కుమార్తె సుప్రితతో మీడియా వాళ్ళకి ఫోజులిచ్చారు. అప్పుడు ఆమె తలనీలాలు సమర్పించి అలానే బయటకి వచ్చి పోజులివ్వటంతో ఈ విషయం తెలిసింది.

surekhavanisuprithatogether.jpg

ఈసారి ఆమె ఒక బలమైన మొక్కు వుండి, అది పూర్తవటంతో తిరుమలకి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె కుమార్తె కూడా ఆమె పక్కనే వున్నారు. తిరుమలకి వచ్చిన కొంతమంది భక్తులు ఆమెతో సెల్ఫీ కూడా తీసుకుంటూ కనిపించారు.

Updated Date - Jan 08 , 2024 | 03:57 PM