Supritha Naidu: సురేఖా వాణి కుమార్తె జాన్వీ కపూర్ ని ఫాలో అవుతోందా... ?

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:09 PM

సురేఖ వాణి కుమార్తె సుప్రిత సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటుంది. ఆమె రెగ్యులర్ గా ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటుంది, అవి వైరల్ కూడా అవుతూ ఉంటాయి. ఆ ఫోటోలు చూసి సుప్రిత ఎక్కువగా హిందీ నటి జాన్వీ కపూర్ ని ఫాలో అవుతూ ఉంటుంది అని అంటున్నారు నెటిజన్స్

Supritha Naidu: సురేఖా వాణి కుమార్తె జాన్వీ కపూర్ ని ఫాలో అవుతోందా... ?
Supritha Naidu

క్యారక్టర్ నటి సురేఖా వాణి కుమార్తె బండారు సుప్రిత సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటూ వైరల్ అవుతూ ఉంటుంది. సుప్రిత సినిమాలు ఏమీ ఇంకా విడుదల కాలేదు కానీ ఆమె పేరు మాత్రం బాగా పాపులర్ అవుతోంది. సామజిక మాధ్యమాల్లో ఆమె పోస్టు చేసే ఫోటోలకి నెటిజన్స్ అప్పుడప్పుడూ ఫిదా అవుతూ వుంటారు, అలాగే వాటిపై కామెంట్స్ కూడా చేస్తూ వుంటారు.

suprithanaidud.jpg

ఈమధ్య అద్దం ముందు నిలుచొని కొన్ని ఫోటోలు తీసుకున్న సుప్రిత అవి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వాటిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ నువ్వు అచ్చం జాన్వీ కపూర్ లా వున్నావు అని చెప్పారు ఒకరు.

suprithanaidua.jpg

హిందీ నటి జాన్వీ కపూర్ కూడా తన చాలా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ ఉంటుంది. అయితే ఆమె హిందీ నటి, శ్రీదేవి కుమార్తె, ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ పక్కన 'దేవర' సినిమాలో కథానాయకురాలిగా చేస్తోంది, అలాగే రామ్ చరణ్ పక్కన దర్శకుడు బుచ్చిబాబు సినిమాలో కూడా చేస్తోంది.

suprithanaiduc.jpg

అలంటి జాన్వీ కపూర్ ని సురేఖా వాణి కుమార్తె సుప్రిత ఫాలో అవుతోంది అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జాన్వీ కపూర్ ఎలా అయితే మంచి గ్లామర్ ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటుందో సురేఖ వాణి కుమార్తె కూడా అటువంటి ఫోటోలనే పోస్టు చేస్తూ ఉంటుంది.

suprithanaidub.jpg

సుప్రిత ఇప్పుడు ఒక సినిమాలో కథానాయకురాలిగా కూడా అరంగేట్రం చేస్తోంది. అయితే ఆ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే వుంది. సినిమా విడుదలవకముందే తన కేవలం ఫోటోల తోటే సుప్రిత ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిపొయింది అని అంటున్నారు. ఇప్పుడు సుప్రిత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jun 11 , 2024 | 12:19 PM