Srimanthudu: నేను డబ్బు అడగలేదు.. నేను అడిగింది ఆ ఒకటే! 

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:38 PM

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘శ్రీమంతుడు’ కాపీ రైట్‌ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాజాగా రచయిత స్పందిస్తూ తనకు నష్టపరిహారం ఇవ్వమని కోరడం లేదన్నారు.

Srimanthudu:  నేను డబ్బు అడగలేదు.. నేను అడిగింది ఆ ఒకటే! 

మహేష్‌ (Mahesh) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu copyright issues) కాపీ రైట్‌ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాజాగా రచయిత స్పందిస్తూ తనకు నష్టపరిహారం ఇవ్వమని కోరడం లేదన్నారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘2012లో నేను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల ఓ మాసపత్రికలో  ప్రచురితమైంది. ఆ కథతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని దర్శకుడు సముద్రను కలిశా. మేం ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాలనుకున్న సమయంలో ‘శ్రీమంతుడు’ విడుదలైంది. అది చూసిన మిత్రులు అది నా కథేనన్నారు. దాంతో నేనూ ఆ సినిమా చూశా. నా కథలో ఉన్నది ఉన్నట్లు స్ర్కీన్‌పై చూసి షాకయ్యా. దర్శకుడితో మాట్లాడా. ఇది నా కథేనని చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. సినీ పెద్దలు కొందరు రాజీ చేయాలని చూశారు. రూ.15 లక్షలు ఆశ చూపించారు. కానీ నాకు రచయితల సంఘం ఎంతో సాయం చేసింది. వాళ్ల సహకారంతోనే కోర్టును ఆశ్రయించా. ఈ  స్క్రిప్ట్ నాదేనని  అంగీకరించమని కోరుతున్నా’’ అని శరత్‌ చంద్ర అన్నారు. (copyright issues)

విషయమై శరత్ చంద్ర కొరటాలపై పిటీషన వేయగా విచారణ జరిపిన కోర్టు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టగా అక్కడా ఎదురు దెబ్బ తగిలింది. 


Updated Date - Feb 01 , 2024 | 08:38 PM