Sitara: తండ్రిని మించుతున్న త‌న‌య‌... ఇన్‌స్టాతో నెలకు ఇంత‌ ఆదాయ‌మా?

ABN , Publish Date - Jan 22 , 2024 | 06:04 PM

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఏడాదికో సినిమా చేసినా త‌న ఎండార్స్‌మెంట్స్ తో నిత్యం చేతినిండా అడ్వ‌ర్టైజ్‌మెంట్ల‌తో బిజీగా ఉంటుంటాడు. ఇప్పుడు అదే బాట‌లో ఆయ‌న కూతురు సితార ప‌య‌నిస్తూ మ‌హేశ్‌కు పొటీ ఇచ్చేలా ఉంది.

Sitara: తండ్రిని మించుతున్న త‌న‌య‌... ఇన్‌స్టాతో నెలకు ఇంత‌ ఆదాయ‌మా?
sithara

టాలీవుడ్ లో మోస్ట్ హ్య‌ప‌నింగ్ స్టార్‌ ఎవ‌రైనా ఉన్నారంటే అది సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) మాత్ర‌మే. సినిమాల‌తో సంబంధం లేకుండా ఏడాదికో సినిమా చేసినా త‌న ఎండార్స్‌మెంట్స్ తో నిత్యం చేతినిండా అడ్వ‌ర్టైజ్‌మెంట్ల‌తో బిజీగా ఉంటుంటాడు. ఓ ర‌కంగా సినిమా క‌న్నా వీటి ద్వారా మ‌హేశ్‌కు వ‌చ్చే ఆదాయ‌మే రెట్టింపు అంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు అదే బాట‌లో ఆయ‌న కూతురు సితార (Sithara Ghattamaneni) ప‌య‌నిస్తూ మ‌హేశ్‌కు పొటీ ఇచ్చేలా ఉంది.

సితార ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి సినిమా చేయ‌కున్నా కేవ‌లం సోష‌ల్ మీడియాలో త‌ను పెట్టే పోస్టుల ద్వారానే ప్ర‌తి నెల రూ. ల‌క్ష‌ల్లో డ‌బ్బులు వెన‌కేసుకుంటోంది. సితార మొద‌టిసారిగా డిస్నీ వారి హాలీవుడ్ చిత్రం ప్రోజ‌న్ 2 కు తెలుగు డ‌బ్బింగ్ చెప్పి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత‌ రెండేండ్ల క్రితం మ‌హేశ్‌బాబు న‌టించిన స‌ర్కారువారి పాట చిత్రంలో పెన్నీ అంటూ సాగే ఓ ప్రత్యేక పాట‌లో న‌టించ‌డంతో సితార పేరు ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో చాలా వ‌స్త్రాల‌, జ్యువెల‌రీ బ్రాండ్స్ సితార‌ను త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకునేందుకు పోటీ ప‌డ్డాయి. కానీ మ‌హేశ్‌, న‌మ్ర‌తల ఆధ్వ‌ర్యంలో అచితూచీ అడుగులు వేస్తోంది.


ఈక్ర‌మంలోనే అతి చిన్న వ‌య‌స్సులోనే సితార PMJ జ్యువెలరీ వారికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సైన్ చేయ‌డ‌మే గాక ప‌లు ఫొటోషూట్స్‌, ప్రోమోష‌న్ వీడియోస్ సైతం చేసింది. అంతేగాక ఈ అడ్వ‌ర్టైజ్మెంట్ అమెరికా టైమ్ స్క్వైర్‌లో ప్ర‌సారం కావ‌డంతో సితార (Sithara Ghattamaneni) పేరు కొద్ది నెల‌ల పాటు దేశ‌వ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ క్ర‌మంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారి నిత్యం త‌న ఫొటోషూట్ల‌ను, ప్రోమోష‌న‌ల్ వీడియోస్‌ను కూడా అందులో షేర్ చేస్తూ వ‌స్తోంది. ఇదిలాఉండ‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియ‌న్ల మంది సితార‌ను ఫాలో అవుతుండ‌గా యూ ట్యూబ్‌లో 10వేల మంది స‌బ్ స్క్రైబ‌ర్స్ ఉన్నారు.

సితార తాను నేర్చుకుంటున్న డ్యాన్స్ వీడియోల‌ను, త‌న విదేశి ప‌ర్య‌ట‌న వీడియోలతో పాటు అప్పుడ‌ప్పుడు మ‌హేశ్ సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను, ఆయ‌న‌తో ఇంట‌ర్మ్వూల‌ను హీరొయిన్ల‌తో చిట్‌చాట్ వీడియోల‌ను ఇన్‌స్టాలో,యూ ట్యూబ్‌లో పెడుతూ వ‌స్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో సితార (Sithara Ghattamaneni) ట్రెండింగ్‌లో ఉంటూ నెల‌కు సుమారు రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ వార్త‌లు విన్న సినీ ప్రేక్ష‌కులు నోరెళ్ల బెడుతున్నారు. సితార ఇంత చిన్న వ‌య‌స్సులో ఇంత ప్ర‌తిభ చూపుతూ తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా పేరు తెచ్చుకొంటుంద‌ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు.

Updated Date - Jan 22 , 2024 | 06:04 PM