గుంటూరు కారం' సినిమా గురించి షారుఖ్ ఖాన్, దానికి మహేష్ ఏమన్నారంటే...

ABN , Publish Date - Jan 13 , 2024 | 06:18 PM

'గుంటూరు కారం' విజయం గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ బాద్ షా ఈ సినిమా గురించి ఏమన్నారో తెలుసా? దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సమాధానం ఇచ్చారు. ఇంతకీ షారుఖ్ ఏమంటారు, మహేష్ ఏమని సమాధానం ఇచ్చారు...

గుంటూరు కారం' సినిమా గురించి షారుఖ్ ఖాన్, దానికి మహేష్ ఏమన్నారంటే...
File picture of Shah Rukh Khan, Namrata and Mahesh Babu

మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సంక్రాంతి పండగ సందర్భంగా నిన్న (జనవరి 12) విడుదలై మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన మూడో సినిమా ఇది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ చేతులు కలిపిన సినిమా ఈ 'గుంటూరు కారం'.

ఈ సినిమాలో మహేష్ బాబు గుంటూరు యాసలో మాట్లాడి వన్ మేన్ షోతో సినిమా అంతా తానై అభిమానులకు ఒక కొత్త మహేష్ బాబును చూపించారని అభిమానులు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. విడుదలైన ప్రతి సెంటర్ లోనూ మహేష్ బాబు కట్ అవుట్ లు పెద్దవి పెట్టి మహేష్ అభిమానులు ఈ సినిమాని రెండు సార్లు, మూడు సార్లు కూడా చూస్తున్నామని సామజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు.

gunturkaaramstill.jpg

ఈ సినిమా ఒక్క తెలుగులోనే విడుదలైనా, బాలీవుడ్ లో కూడా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ బాద్ షా ఈ షా అయిన షా రుఖ్ ఖాన్ ఈ 'గుంటూరు కారం' సినిమా కోసం ఎదురు చూస్తున్నాను మిత్రమా అంటూ మహేష్ బాబు ని ఉద్దేశించి 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. దీనికి మహేష్ బాబు కూడా సమాధానం చెప్పారు. 'మా సినిమాని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదములు' అంటూ మహేష్, షా రుఖ్ ఖాన్ కి సమాధానం చెప్పారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Updated Date - Jan 13 , 2024 | 06:18 PM