దోశ వేసిన రామ్‌చ‌ర‌ణ్‌.. మెగాస్టార్ ఇంట అంబ‌రాన్నంటిన సంక్రాంతి సంబురాలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 04:11 PM

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌జ‌లు సంక్రాంతి సంబురాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటున్నారు. అయితే ఈ సంక్రాంతి మెగాస్టార్ చింజీవి అండ్ ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఇంటిల్లిపాది ఇప్ప‌టికే బెంగ‌ళూరులోని ఫార్మ్‌హౌస్‌కు చేరుకుని వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు.

దోశ వేసిన రామ్‌చ‌ర‌ణ్‌.. మెగాస్టార్ ఇంట అంబ‌రాన్నంటిన సంక్రాంతి సంబురాలు
ram charan

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌జ‌లు సంక్రాంతి సంబురాల‌ను అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుపుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర‌లో సంబురాలు నింగినంటాయి. వీటితో పాటు కోడి పందాలు జోరందుకున్నాయి. ఇదిలాఉండ‌గా తెలుగు సెల‌బ్రిటీస్ త‌మ సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్‌ల‌ ద్వారా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

అయితే మెగాస్టార్ చింజీవి అండ్ ఫ్యామిలీకి ఈ సంక్రాంతి చాలా ప్రాముఖ్య‌త ఉంది. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు బిడ్డ క్లింకార (Klin Kaara) జ‌న్మంచ‌డం, వ‌రుణ్‌ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిల వివాహ‌ల త‌ర్వాత వ‌చ్చిన పండుగ కావ‌డంతో ఇంటిల్లిపాది ఇప్ప‌టికే బెంగ‌ళూరులోని ఫార్మ్‌హౌస్‌కు చేరుకుని ప్ర‌త్యేకంగా, ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు.


ఇప్ప‌టికే చిరంజీవి (Chiranjeevi) దంప‌తులు,రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఉపాస‌న (upasana), అల్లు అర్జున్ (Allu Arjun),స్నేహ‌, నాగ‌బాబు దంప‌తులు, వ‌రుణ్ తేజ్(Varun Tej) లావ‌ణ్య దంప‌తులు, సాయి ధ‌ర‌మ్ తేజ్(Sai DharamTej), వైష్ణ‌వ్ తేజ్(Vaisshnav Tej), అఖిరా నంద‌న్ (Akira Nandan), ఆద్య (Aadya) త‌దిత‌రులంతా అంతా అక్క‌డికి వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో వారంతా క‌లిసి చేసిన హాడావుడి, ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, సురేఖ దోశ‌లు మీరూ ఓ లుక్కేయండి.


Updated Date - Jan 14 , 2024 | 04:30 PM