40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమంత తన పెళ్లి, విడాకులు గురించి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jan 18 , 2024 | 05:49 PM

సమంత రుత్ ప్రభు మళ్ళీ వార్తల్లో వున్నారు. ఇన్‌స్టాలో తన ప్రసార ఛానెల్‌లో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా, సమంత తన అభిమానులతో పెళ్లి, విడాకుల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Samantha talks about her divorce with her fans on broadcast channel

సమంత రుత్ ప్రభు ఇప్పుడు మయోసిటిస్ అనే వ్యాధినుండి కోలుకుంటూ వస్తున్నారు. కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా పూర్తిగా విశ్రాంతికి పరిమితం అయ్యారు, అలా అని ఏమీ పని చెయ్యకుండా కూడా లేకుండా, అభిమానులతో ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలను పంచుకుంటూ తన సామజిక మాధ్యమంలో మాత్రం చురుకుగా వున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమధ్య ఆమె తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ బ్రాడ్ కాస్ట్ లో తన గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అందులో ఆమె పెళ్లి, విడాకులు, తరువాత వచ్చిన పరిస్థితుల గురించి ముచ్చటించారు. అందులో ఆమె కొన్ని షాకింగ్ నిజాలు కూడా బయటపెట్టారు.

సమంత, నాగ చైతన్యల వివాహం 2017 లో జరిగింది. సమంత తన మొదటి తెలుగు సినిమా 'ఏ మాయ చేసావే' లో కథానాయకురాలిగా నాగ చైతన్య పక్కన చేసింది. ఆ సినిమా 2010లో విడుదలైంది. పెళ్ళైన నాలుగు సంవత్సరాల తరువాత అంటే 2021 లో సమంత, నాగ చైతన్య విడిపోయారు. సమంత తన వివాహ బంధం, విడాకులు గురించి ఇంతకు ముందు రెండు మూడు సందర్భాల్లో మాట్లాడింది కానీ ఈసారి అభిమానులతో కూడా కొన్ని కొత్త విషయాలు పంచుకుంది. (Samantha talks about her marriage, divorce with her fans)

ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత తనదైన శైలిలో సమాధానం చెప్పారు. "నేను వివాహ బంధంలో వున్నప్పటి సమయంలో నాకు వ్యక్తిగత జీవితంలో ఏమి నచ్చుతాయి, ఏమి నచ్చవు అనేవి తెలుసుకోవడంలో నేను పూర్తిగా వైఫల్యం చెందాను. ఎందుకంటే అప్పుడు నా భాగస్వామి ప్రభావం నా మీద చాలా ఉండటం వలన, ఇవన్నీ తెలుసుకోలేకపోయాను," అని చెప్పుకొచ్చారు. అయితే ఆ విషయాన్నీ గ్రహించిన తరువాత తన బలం ఏంటో తనకి తెలిసిందని, ఆ తరువాతే తాను ఎదగడం నేర్చుకున్నాను అని చెప్పారు సమతా.

"కష్ట సమయంలో వున్నప్పుడు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాను, ఆ తరువాత అవి తనకి ఎంతో ఉపయోగపడ్డాయి," అని చెప్పారు సమంత. మయోసిటిస్ వ్యాధి, విడాకులు, సినిమాలు ఫ్లాపు అవటం అన్నీ ఒకేసారి రావటంతో ఎంతో కుంగిపోయినట్టు ఆమె ఇంతకు ముందు కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ చెప్పారు.

సమంత కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోలేదు కానీ నిర్మాతగా మారి సినిమా నిర్మాతం చేద్దామన్న ఆలోచనలో వున్నారు. అందుకే ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థని ఆమె ప్రారంభించారు. ఆమె నటించిన 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ విడుదలకి సిద్ధంగా వుంది. ఇందులో ఆమె వరుణ్ ధావన్ పక్కన నటించింది.

Updated Date - Jan 18 , 2024 | 05:49 PM