SS Rajamouli: ఫంక్ష‌న్‌లో.. స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన రాజ‌మౌళి (వీడియో వైర‌ల్)

ABN , Publish Date - Mar 31 , 2024 | 08:39 PM

ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కు త‌న భార్య ర‌మ‌తో క‌లిసి వెళ్లిన రాజ‌మౌళి అక్క‌డ ఓ పాట‌కు చేసిన‌ డ్యాన్స్ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది.

 SS Rajamouli: ఫంక్ష‌న్‌లో.. స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన రాజ‌మౌళి (వీడియో వైర‌ల్)
rajamouli

ఎప్పుడు త‌న ప‌నేదో త‌ను చూసుకుంటూ.. అవ‌స‌రం మేర‌కు మాత్ర‌మే మాట్లాడుతూ తెలుగునాట మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్‌గా పేరు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు SS రాజ‌మౌళి(Ss Rajamouli). త‌న సొంత సినిమా ప్ర‌మోష‌న్లు, అప్పుడ‌ప్పుడు తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్ర‌మే రాజ‌మౌళి Ss Rajamouli) హ‌జ‌ర‌వుతూ త‌న స్టైల్‌లో మ‌ట్లాడి అక్క‌డికి వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను ఆక్టుకుంటాడు.

ఫ్యామిలీమెన్‌గా ఇప్ప‌టికే మంచి పేరున్న రాజ‌మౌళి Ss Rajamouli) త‌రుచూ ఏ ప్ర‌దేశానికి వెళ్లినా కుటుంబంతోనే వెళ్తూ ఉంటాడు. అలాంటిది తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కు త‌న భార్య ర‌మ‌తో క‌లిసి వెళ్లిన ఆయ‌న అక్క‌డ ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమ‌రాణి ఉత్త‌రాల‌కే అనే పాట‌కు చేసిన‌ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన వాడంతా రాజ‌మౌళి Ss Rajamouli) క‌నిపేంచేంత అమాయ‌కుడు కాదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇదిలాఉండ‌గా RRR వంటి గ్లోబ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత రాజ‌మౌళి Ss Rajamouli) సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబుతో #SSMB29 సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌థ‌, స్క్రిప్టు సిద్దం కాగా ఈటీవ‌లే మ‌హేశ్ బాబు ఓ స్పెష‌లిస్ట్ ట్రైనర్ జ‌మ‌క్షంలో జిమ్ శిక్ష‌ణ తీసుకోగా, స్క్రీన్ టెస్టులు కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ఓ హాలీవుడ్న‌టిని క‌థానాయుక‌గా సెల‌క్ట్ చేసిన‌ట్లు స‌మాచారం కాగా ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది.

Updated Date - Mar 31 , 2024 | 08:39 PM