తల్లితో కలిసి వంట చేసిన రామ్‌చరణ్.. ఏం వండుతున్నారండి అంటూ ఉపాసన వీడియో వైరల్

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:52 PM

మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ ఇంట్లో మ‌రోసారి త‌న పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించి తల్లితో కలిసి వంట చేస్తూ భ‌ళా అనిపించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తల్లితో కలిసి వంట చేసిన రామ్‌చరణ్.. ఏం వండుతున్నారండి అంటూ ఉపాసన వీడియో వైరల్
RAMCHARAN UPASANA

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. స‌మ‌యం దొరికిన‌ప్పుడు వంట చేసే స‌మ‌యంలో త‌న త‌ల్లి సురేఖ‌కు తోచిన విధంగా సాయం చేస్తుంటారు. అలాంటి వీడియోలు ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం చాలానే చూశాం. అవి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి కూడా.

తాజాగా ఈ రోజు మ‌హిళాదినోత్స‌వం (Womens Day Celebration) సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) మ‌రోసారి త‌న పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించి తల్లితో కలిసి వంట చేస్తూ భ‌ళా అనిపించారు.


ఈ వీడియోను మెగా కోడ‌లు ఉపాస‌న (Upasana Konidela) త‌న మొబైల్‌లో చిత్రీక‌రించ‌డ‌మే కాక అత్త‌మ్మ గారండి మీ కిచెన్‌లో ఏం అవుతుంది.. రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) గారు ఏం వండుతున్నారండి అంటూ వారు చేస్తున్న వంట‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. చివ‌ర‌లో ప్రతిరోజూ ఉమెన్స్ డే అయితే బాగుంటుందంటూ ముగించింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

Updated Date - Mar 08 , 2024 | 11:15 PM