Pushpa2 The Rule: నాని తొంద‌ర‌.. పుష్ప‌2 వాయిదా నిజ‌మేనా?

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:59 PM

పుష్ప చిత్రం దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించారు.అయితే ఓ రెండు రోజుల నుంచి పుష్ప-2 విడుదల వాయిదాప‌డిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 Pushpa2 The Rule: నాని తొంద‌ర‌.. పుష్ప‌2 వాయిదా నిజ‌మేనా?
pushpa

పుష్ప (Pushpa 2 The Rule) చిత్రం దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 (Pushpa 2 The Rule) సినిమా తెరకెక్కుతోంది. తొలి భాగం సాధించిన విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెల‌కొన్న నేప‌థ్యంలో మేక‌ర్స్‌, ముఖ్యంగా సుకుమార్ ఈ చిత్రాన్ని పార్ట్‌1ను మించేలా జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కిస్తున్నాడు. అదీ కాక‌ ఈ చిత్రానికి అల్లు అర్జున్ (Allu Arjun) కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ఎంతో బాధ్యతతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రష్మిక మందన్నా క‌థానాయిక‌గా, పాహాద్ ఫాజిల్, సునీల్‌, అన‌సూయ కీల‌క‌ పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోండ‌గా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

GFAKvBRaQAAhyna.jpeg

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించ‌గా ఓ రెండు మూడ్రోజుల నుంచి పుష్ప-2 (Pushpa 2 The Rule) విడుదల వాయిదా అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై బన్నీ (Allu Arjun) డిజిటల్‌ టీమ్‌ వివరణ కూడా ఇచ్చింది. అనుకున్న సమయానికే పుష్పరాజ్‌ ర్యాంపేజ్‌ ఖాయం అంటూ ట్వీట్ సైతం చేశారు. తాజాగా సుకుమార్‌ టీమ్‌ మరోసారి ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో స్పష్టతనిచ్చింది. ఇంకా 200 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్స్‌ ప్రారంభం కానున్నాయి’’ అని చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో పుష్ప-2 విడుదలలో ఎలాంటి మార్పు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చినట్టైంది.


na.jpegఅయితే ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల తెల్లారే పుష్ప 2 సినిమా వాయిదా ప‌డిన‌ట్లు, ప‌డుతున్న‌ట్లు వార్త‌లు మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఈ క్ర‌మంలో అగ‌ష్టు 15 (15th August) న ఓ నాలుగు పాన్ ఇండియా సినిమాల‌తో పాటు 6 తెలుగు సినిమాలు మొత్తంగా ప‌ది చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నాచుర‌ల్ స్టార్ నాని (Nani) తాజాగా న‌టిస్తున్న స‌రిపోదా శ‌నివారం (Saripodhaa Sanivaaram) అనే సినిమా కూడా అదే రోజున విడుద‌ల చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

పుష్ప‌2 సినిమా విడుద‌ల‌ను బ‌ట్టి త‌మ‌ సినిమాను రిలీజ్ చేసేందుకు య‌త్నిస్తున్నారు. ఈక్ర‌మంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప‌2 (Pushpa 2 The Rule) సినిమా వాయిదా ప‌డింద‌ని, నాని (Nani) స‌రిపోదా శ‌నివారం (Saripodhaa Sanivaaram) చిత్రం ఆ తేదీకి విడుద‌ల అవుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 03:34 PM