Hithalaka Karibyada Maava: ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ పాటదే రచ్చ.. నెటిజ‌న్ల రీల్స్‌తో ట్రెండింగ్‌

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:45 PM

సోష‌ల్‌ మీడియాలో నిత్యం ఏదో ఓ పాట ట్రెండింగ్‌లో ఉంటుంది. జ‌నం కూడా వాటినే బాగా ఫాలో అవుతుంటారు. తాజాగా ఇప్పుడు ఆ బాట‌లోకి మ‌రో కొత్త పాట వ‌చ్చి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Hithalaka Karibyada Maava: ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ పాటదే రచ్చ.. నెటిజ‌న్ల రీల్స్‌తో ట్రెండింగ్‌
PRABHUDEVA

ప్ర‌స్తుతం మ‌న సొసైటీలో సినిమాల క‌న్నా రీల్స్ పెద్ద ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా మారిపోయింది. చాలా మంది రోజ‌లో స‌గం స‌మ‌యం దీనిపైనే పెడుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఈ క్ర‌మంలో వారికి త‌గ్గ‌ట్టుగా పాత ఒక రోత కొత్త ఒక వింత అన్న చందంగా వారానికోటి, రోజుకోటి చొప్పున ఏదో ఓ అంశం, పాటో వాళ్ల దృష్టిలో ప‌డి వైర‌ల్‌గా మారుతోంది.. త‌ర్వాత ట్రెండింగ్‌లో నిలుస్తూ వ‌స్తున్నాయి.

prabhu.jpg

ఆ మ‌ధ్య త‌మిళ‌ డిక్కీలోనా (Dikkiloona) అనే సినిమాలోని పెర్ వాచాలుమ్ వైక్కామా ( Per Vachaalum Vaikkaama), విక్రాంత్ రోణాలోని రా రా ర‌క్క‌మ్మ, నిన్న‌టి వ‌ర‌కు కుమారి అంటీ, హీరియే హీరియే, కుర్చీ మ‌డ‌త పెట్టి అనే పాట‌లు సోష‌ల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ర‌చ్చ చేయ‌గా తాజాగా ఇప్పుడు మ‌రో కొత్త పాట ఈ బాట‌లోకి వ‌చ్చి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.


అయితే ఇప్పుడు రీల్స్‌తో బాగా వైర‌ల్ అవుతున్న ఈ పాట ఓ క‌న్న‌డ సినిమాది కావ‌డం విశేషం, శివరాజ్ కుమార్ (DrShiva Rajkumar), ప్ర‌భుదేవా ( Prabhu Deva ) న‌టించిన కరటక ధమనక (Karataka Dhamanaka) అనే చిత్రంలోనిది. ఇందులో ప్ర‌భుదేవా, నిశ్వికా నాయుడు (Nishvika Naidu)ల‌పై చిత్రీక‌రించిన హితలక కరిబ్యద మావ (Hithalaka Karibyada Maava ) అనే పాట నెటిజ‌న్ల‌కు వీప‌రీతంగా న‌చ్చేయ‌డంతో చాలామంది ఇప్పుడు ఈ పాట రీల్సే చేస్తు సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తున్నారు.

అయితే ఈ రీల్స్ చేయ‌డం కేవ‌లం యూత్‌, నెటిజ‌న్ల‌కే కాకుండా సెల‌బ్రిటీలు కూడా ఇప్పుడు ఈ పాట‌పై బాగానే రీల్స్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ పాట రీల్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌న టాలీవుడ్ సెట‌బ్రిటీలు బ్రహ్మాజీ, ఆది , ఇత‌ర యూ ట్యూబ్ తార‌లు కూడా ఇదే పాట‌పై రీల్స్ చేస్తున్నారు. మీరూ వాటిపై ఓ లుక్కేయండి మ‌రి.

Updated Date - Mar 26 , 2024 | 10:48 PM