Prabhas: జీవితంలోకి ప్ర‌త్యేక వ్య‌క్తి.. ప్ర‌భాస్ పోస్ట్ పెళ్లి గురించేనా?

ABN , Publish Date - May 17 , 2024 | 12:12 PM

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వ‌చ్చాడు. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాకుండా తాజాగా తాను చేసిన ఇన్ స్టా స్టోరీ పోస్ట్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Prabhas: జీవితంలోకి ప్ర‌త్యేక వ్య‌క్తి.. ప్ర‌భాస్ పోస్ట్ పెళ్లి గురించేనా?
prabhas

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వ‌చ్చాడు. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాకుండా తాజాగా తాను చేసిన ఇన్ స్టా స్టోరీ పోస్ట్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడా పోస్ట్ చూసిన వారంతాప్ర‌భాస్ (Prabhas) పెళ్లి గురించే అని అంతా చ‌ర్చించుకుంటుండ‌డంతో ఈ విష‌యం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ పోస్టులో.. మొత్తానికి ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి మ‌న‌ జీవితంలోకి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ రాసుకొచ్చారు.

ee430ebb-aaf0-4de6-a710-949cb9f69c7f.jpeg


అయితే ఇది ప్ర‌భాస్ (Prabhas) పెళ్లికి సంబంధించిన పోస్ట్ అంటూ ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇది క‌చ్చితంగా పెళ్లికి సంబంధించిన న్యూసే అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే మ‌రికొంద‌రు ఇది క‌ల్కి (Kalki 2898 AD) సినిమాకు సంబంధించిన అప్డేట్ అయి ఉంటుంద‌ని అంటున్నారు. అదేలాంటి వార్త‌ అయినా మ‌ళ్లీ ప్ర‌భాసే వచ్చి చెప్పేంత వ‌ర‌కు గానీ క్లారిటీ రాదు. అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే త‌ప్ప‌దు మ‌రి.

Raja-Saab-Prabhas.jpg

Updated Date - May 17 , 2024 | 12:15 PM