'మా ఊరి పొలిమేర' హీరోయిన్ ని చూస్తే షాకవుతారు, ఫోటో వైరల్

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:30 PM

'మా ఊరి పొలిమేర' సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ల అందులో ఒక పల్లెటూరి మహిళగా నటించటమే కాకుండా, ఆ పాత్రకి సరైన న్యాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే నిజ జీవితంలో ఆమె గ్లామర్ ఫోటో ఒకటి ఆమె సామజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

'మా ఊరి పొలిమేర' హీరోయిన్ ని చూస్తే షాకవుతారు, ఫోటో వైరల్
Kamakshi Bhaskarla photo goes viral

వెండితెర మీద సినిమా చోస్తున్నప్పుడు అందులోని కథానాయికలు ఒకలా కనపడతారు, అదే నిజ జీవితంలో సామజిక మాధ్యమంలో వాళ్ళు పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే తెరమీద చూసింది వీళ్ళనేనా అనే సందేహం వస్తుంది. అంతలా ఒకదానితో ఒకటి అసలు పోలికలు వుండవు. 'మా ఊరి పొలిమేర' సినిమా రెండు పార్టులుగా వచ్చింది, మొదటిది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదలైతే, రెండోది థియేటర్స్ లో విడుదలైంది.

మొదటి పార్టులో ఎంతో బోల్డ్ పాత్రలో కనపడిన కామాక్షి ఆ సినిమాలో ఒక పల్లెటూరి ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఆ సినిమా ఆమెకి మంచి పేరు తీసుకువస్తే, రెండో పార్టులో కూడా ఆమె అదే పాత్రని కంటిన్యూ చేశారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది, కామాక్షికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ ఆమె ఇంకా మంచివి, పెద్దవి చెయ్యాలని అనుకుంటోంది.

kamakshibhaskarlaveryhot.jpg

నిజ జీవితంలో డాక్టర్ గా వున్న కామాక్షి 'పొలిమేర' సినిమా చేతబడి నేపధ్యంగా వచ్చిన కథ కావటంతో, అటువంటివి తాను నమ్మను అని చెప్పారు. ఆ సినిమాకి మాటలు రాయటంలో కూడా కామాక్షి సహాయం చేశారు, అలాగే దర్శకత్వ శాఖలో కూడా పని చేశారు. అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలని అని అంటున్న ఆమె ముందు ముందు దర్శకత్వం చేస్తానేమో అని కూడా చెప్పారు.

ఇప్పుడు ఆమె ఒక గ్లామరస్ ఫోటో ఒకటి ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు 'పొలిమేర' సినిమాల వేసింది ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతలా ఈ గ్లామర్ ఫోటోలో కనిపిస్తున్నారు కామాక్షి.

Updated Date - Feb 01 , 2024 | 02:30 PM