Pawan - Anna Lezhneva: భార్యతో కలిసి ఓటు వినియోగం.. పోతినకు కౌంటర్లు!

ABN , Publish Date - May 13 , 2024 | 10:06 AM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని (Mangalagiri) పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఆయన సిబ్బందిని కలిశారు.

Pawan - Anna Lezhneva: భార్యతో కలిసి ఓటు వినియోగం.. పోతినకు కౌంటర్లు!


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని (Mangalagiri) పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఆయన సిబ్బందిని కలిశారు. ఇక, తన భార్య అన్నా లెజినోవాతో (Anna Lezhneva) కలిసి సేనాని పవన్‌ చేతి వేలిపై సిరా ముద్ర వేసి ఈవీఎం మిషన్‌ దగ్గరకు పంపించారు. దీంతో పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రానికి పవన్‌ కళ్యాణ్‌ వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పవన్‌ సీఎం పవన్‌ సీఎం పవన్‌ సీఎం అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.  ఓటు వేసిన పవన్‌ కళ్యాణ్‌ కీలక సందేశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు. పిఠాపురం నుంచి జనేసన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలో దిగిన సంగతి తెలిసిందే.

Anna.jpeg

అయితే ఇటీవల ఓ సమావేశంలో పవనకల్యాణ్‌ను దుర్భాషలాడుతూ పోతిన మహేష్‌ కామెంట్స్‌ చేశారు. "మీ మూడో భార్య అన్నా లెజినోవా మీతోనే ఉంటే పిఠాపురంలోని కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీసమేతంగా రండి’ అని సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా  పవన్   కల్యాణ్‌ తన భార్యతో కలిసి మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతుంది. పోతిన మహేష్‌తోపాటు ఆ తరహా కామెంట్స్‌ చేసిన వారికి ఈ వీడియో చెంపపెట్టులా ఉందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. "పోతిన మహేష్ కాస్త కళ్లు తెరచి చూడు’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. 

Pk.jpg

Updated Date - May 13 , 2024 | 10:17 AM