P Susheela: శ్రీవారికి తల నీలాలు సమర్పించుకున్న మహా గాయని!

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:51 PM

మహా గాయని పి. సుశీల తన మొక్కును తీర్చుకున్నారు. తన మధురమైన గానంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సుశీలమ్మ.. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న తన మొక్కును మంగళవారం ఆమె తిరుమల శ్రీవారి సన్నిధిలో తీర్చుకున్నారు. ఈ మొక్కు తీర్చుకోవడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.

P Susheela: శ్రీవారికి తల నీలాలు సమర్పించుకున్న మహా గాయని!
P Susheela

మహా గాయని పి. సుశీల (P Susheela) తన మొక్కును తీర్చుకున్నారు. తన మధురమైన గానంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సుశీలమ్మ.. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న తన మొక్కును మంగళవారం ఆమె తిరుమల శ్రీవారి సన్నిధిలో తీర్చుకున్నారు. ఈ మొక్కు గురించి ఆమె మాట్లాడుతూ.. ఎన్నాళ్ళుగానో స్వామి వారికి తల నీలాలు సమర్పించుకునే మొక్కు ఉంది. ఆ మొక్కును ఇవాళ తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందని నవ్వులు చిందించారు.

Also Read- Pawan Kalyan Varahi Deeksha: వారాహి దీక్ష ఎందుకు చేస్తారంటే..


Singer-Susheela.jpg

తలనీలాల మొక్కు తీర్చుకున్న అనంతరం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెతో ఫొటోలు అక్కడున్న భక్తులు పోటీ పడ్డారు. పి. సుశీలమ్మ విషయానికి వస్తే.. తెలుగు సినీ రంగంలో 50వేలకు పైగా పాటలు పాడిన మహా గాయని ఆమె. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, సంస్కృతం, తుళు.. ఇలా పలు భాషలలో పాటలు పాడి గాన కోకిలగా గుర్తింపు పొందారు. ‘కన్నతల్లి’ అనే సినిమాలో పాడిన పాటతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసిన సుశీల (Singer Susheela).. కొన్ని దశాబ్దాలుగా తన గాన మాధుర్యంతో అందరినీ ఓలలాడిస్తూ వస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 25 , 2024 | 08:06 PM