Niharika Konidela: పెళ్లిపై నిహారిక ఎమోష‌న‌ల్ వీడియో.. మాజీ భ‌ర్త స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

ABN , Publish Date - Jan 26 , 2024 | 07:40 PM

చైతన్య తో విడాకుల తర్వాత కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక మళ్ళీ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, సినిమాలు నిర్మిస్తూ, నటిగా కూడా బిజీ అవుతుంది. తాజాగా మొదటిసారి విడాకులపై మాట్లాడింది.

Niharika Konidela: పెళ్లిపై నిహారిక ఎమోష‌న‌ల్ వీడియో.. మాజీ భ‌ర్త స్ట్రాంగ్ కౌంట‌ర్‌!
niharika

చైతన్య తో విడాకుల తర్వాత కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక (Niharika Konidela) మళ్ళీ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, సినిమాలు నిర్మిస్తూ, నటిగా కూడా బిజీ అవుతుంది. తన కెరీర్ పై ఫోకస్ చేసింది. అయితే నిహారిక మొదటిసారి ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన పెళ్లి, విడాకులు, ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్, సినిమాలు, పవన్ కళ్యాణ్ రాజకీయాలు.. ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడింది. తన పెళ్లి గురించి, విడాకులప్పుడు జరిగిన సంఘటనలని తలుచుకొని ఎమోషనల్ అయింది.

ఈ ఇంటర్వ్యూలో నిహారిక (Niharika Konidela) తన పెళ్లి, డైవర్స్ గురించి మాట్లాడుతూ.. ‘ నాది లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్ మ్యారేజ్. కొన్ని వర్కౌట్ అవ్వక విడి పోవాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత లైఫ్ బాగా ఉండాలని అంతా అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను. కానీ తర్వాత మనుషులని నమ్మకూడదని అర్థమైంది. ఈ పెళ్లితో నేను ఒక లైఫ్ లెస్సన్ నేర్చుకున్నాను. నా విడాకుల తర్వాత ఎంతో ఏడ్చాను. చాలా బాధగా ఉంటుండే, అందరూ నన్నే కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చూసి చాలా బాధపడ్డాను. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా నిలబడింది. దాని నుంచి బయటకి రావడానికి చాలా టైం పట్టింది. ప్రస్తుతానికి నేను సింగిల్. లైఫ్‌లో హ్యాపీగా ఉన్నాను’ అంటూ పలు ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్ చేసింది.


అయితే ఈ వీడియోకి నిహారిక మాజీ భర్త చైతన్య (Chaitanya) లైన్ లోకి వచ్చి హాట్ కామెంట్స్ చేశాడు. ఇంటర్వ్యూ ప్రోమో కింద తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యాడు. ‘నిహారికపై వచ్చిన నెగిటివిటి గురించి లేట్‌గా అయిన మాట్లాడి అందరికి తెలియచేసినందుకు నేను అభినందిస్తున్నాను. అలాంటి వ్యక్తిగత కామెంట్స్ ఎదుర్కోవడం చాలా కష్టమని తెలుసు. కానీ ఇండైరెక్ట్ గా అందులో ఉన్న బాధితుల గురించి ఇలా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇలా జరగడం రెండోసారి. ఆ బాధ రెండు వైపులా ఒకేలా ఉంటుంది. విడాకుల గురించి మాట్లాడకూడదు, ముఖ్యంగా ఒక వైపే మాట్లాడకూడదు.

chithanya.jpeg

అనుభవించిన బాధ కంటే , దాని నుంచి ఎలా బయటపడింది మాట్లాడితే ప్రజలకు ఉపయోగ పడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ ఏమి తెలియకుండా ప్రజలు ఒక వైపు జడ్జ్‌ చేసి కామెంట్స్ చేయడం పూర్తిగా ఎంత తప్పో, ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు జరిగింది మాత్రమే చెప్పడం కూడా అంతే తప్పు. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా అని చైతన్య’ (Chaitanya) కామెంట్స్ చేశాడు.

Updated Date - Jan 26 , 2024 | 08:19 PM