Niharika Konidela: మళ్ళీ పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు, కానీ...

ABN , Publish Date - Jan 27 , 2024 | 03:12 PM

నిహారిక కొణిదెల తన పెళ్లి, విడాకుల గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడేరు. అందులో తన రెండో పెళ్లి గురించి కూడా చెప్పారు, ఇంతకీ ఆమె మళ్ళీ చేసుకుంటారా, చేసుకోరా, ఏమి చెప్పారంటే...

Niharika Konidela: మళ్ళీ పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు, కానీ...
NIharika Konidela

నిహారిక కొణిదెల వార్తల్లో వున్నారు ఇప్పుడు. ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో తన విడాకుల గురించి, తన గురించి, తల్లిదండ్రుల గురించి ఇంకా కెరీర్ గురించి చాలా మాట్లాడేరు. వివాహం అవగానే స్త్రీ ఇంకా సినిమాలు చెయ్యదు అని అందరూ ఎందుకు అనుకుంటారో అర్థం కాదు అని చెప్పారు. అది ఒక కెరీర్, జాబ్ లాంటిది, వివాహం అయితే జాబ్ మానేస్తామా, మానెయ్యం కదా, అందుకే వివాహం అయినా తాను కెరీర్ ని వదులుకోలేదు అని చెప్పారు నిహారిక. తన వదిన లావణ్య కూడా అంతే, ఆమె కూడా సినిమాలు చేస్తారు అని చెప్పింది.

niharikanewpicture.jpg

ఇక తన పెళ్లి, విడాకుల గురించి ప్రస్తావిస్తూ, తాను ఒక మంచి పాఠం నేర్చుకున్నాను అని చెప్పారు. ఇదే సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి కూడా గురయ్యారు నిహారిక. 'నీకు 60 ఏళ్ళు వచ్చేంతవరకు నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు, నీ గురించి ఎవరు ఏమనుకున్నా, నేనేమి పట్టించుకోను. నువ్వు నాకు దొరికిన ఒక గొప్ప వరం. అందుకని నా దగ్గరే ఉండొచ్చు' అని తన తండ్రి తనతో చెప్పిన మాటలు తలుచుకొని నిహారిక భావోద్వేగానికి గురయ్యారు. అలాగే నాగబాబు లాంటి తండ్రి దొరకటం తన అదృష్టం అని కూడా చెప్పారు నిహారిక.

niharikatravelling.jpg

ఇదే ఇంటర్వ్యూ లో తాను రెండో పెళ్ళికి వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేసేసారు. నేను బ్లాక్ చెయ్యలేదు, ఆలా అని దాని వెనకాల పరిగెత్తడమూ లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం అయితే కెరీర్ మీద బాగా దృష్టి పెట్టినట్టుగా చెప్పారు. "నాకు ఇంకా 30 ఏళ్లే. నేను నా హార్ట్ ని బ్లాక్ చెయ్యలేదు, అలా అని కావాలని పరిగెత్తడం లేదు, అదొచిన్నప్పుడు చూద్దాం' అని తన మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడేరు నిహారిక. తన తల్లిదండ్రులు, అన్న వరుణ్ తేజ్ తనకి ఆ సమయంలో ఎంతో సపోర్ట్ గా వున్నారని చెపుతూ తనకి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు నిహారిక.

Updated Date - Jan 27 , 2024 | 03:12 PM