Sai Dharam Tej: 'గాంజా శంకర్' సినిమా ఉందా? లేని సినిమాకి టైటిల్ మార్పు

ABN , Publish Date - Feb 19 , 2024 | 10:59 AM

సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సంపత్ నంది కాబినేషన్ లో వస్తున్న 'గాంజా శంకర్' సినిమా టైటిల్ నార్కోటిక్స్ బ్యూరో మార్చమన్నారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ అసలు లేదని, ఎప్పుడో షెల్వ్ అయిపోయిందని ఇంకో వార్త కూడా వుంది.

Sai Dharam Tej: 'గాంజా శంకర్' సినిమా ఉందా? లేని సినిమాకి టైటిల్ మార్పు
Sai Dharam Tej

సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా టైటిల్ 'గాంజా శంకర్' అని కూడా పెట్టారు, సితార ఎంటర్ టైనమెంట్ సంస్థ ఈ సినిమా నిర్మాణం చేపట్టనుంది అని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా టైటిల్ 'గాంజా శంకర్' నార్కోటిక్స్ బ్యూరో మార్చమన్నారని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అప్పుడెప్పుడో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు నాడు విడుదల చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం అసలు ఈ సినిమానే లేదని ఒక వార్త పరిశ్రమలో వినపడుతోంది. సాయి ధరమ్ తేజ్ సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం, ఈ సినిమా అసలు లేదని, సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందువలన ఈ సినిమా టైటిల్ మార్చినా మార్చకపోయినా, ఈ సినిమా అయితే లేదు అని అంటున్నారు. అసలు సినిమానే లేనప్పుడు ఇంక టైటిల్ మార్చే అవసరం ఎందుకు అని కూడా ఒక వార్త నడుస్తోంది.

SaiDharamTej-new.jpg

ఈ సినిమాకి అనుకున్నదానికన్నా చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని, అంత బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీయడం సాయి ధరమ్ తేజ్ కి ఇష్టం లేదని, అందుకనే ఈ ప్రాజెక్ట్ అసలు లేదని కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఇంతకు ముందు ఈ ప్రాజెక్ట్ అసలు లేదని వార్తలు వచ్చినప్పుడు కూడా నిర్మాణ సంస్థ కానీ, దర్శకుడి నుండి కానీ ఎటువంటి స్పందన లేదు.

ఇప్పుడు నార్కోటిక్స్ వాళ్ళు ఈ సినిమా టైటిల్ మార్చమన్నారు అనే వార్త వైరల్ అవుతూ ఉండటంతో ఇప్పుడైనా నిర్మాణ సంస్థ స్పందిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా వున్నట్టా, లేనట్టా అనే విషయం కూడా ఖరారు అవుతుందని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వేరే కథలను వింటున్నారని కూడా తెలిసింది. ఇంత జరిగాక ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళుతుందన్న ఆశ అయితే మాత్రం సాయి ధరమ్ తేజ్ అభిమానులకి లేదు.

Updated Date - Feb 19 , 2024 | 10:59 AM