Nagarjuna: మాల్దీవ్స్ నాకిష్ట‌మైన ప్లేస్‌.. నాగార్జున కామెంట్స్ వైర‌ల్

ABN , Publish Date - Jan 15 , 2024 | 09:39 AM

న‌ట సామ్రాట్ నాగార్జున చాలాకాలం త‌ర్వాత ఓ స‌క్సెస్ చూశారు. నా సామిరంగా సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో మాట‌ల మ‌ధ్య మాల్దీవ్స్ ప‌ర్య‌ట‌న గురించి చెప్పిన మాట‌లు సోష‌ల్‌ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Nagarjuna: మాల్దీవ్స్ నాకిష్ట‌మైన ప్లేస్‌.. నాగార్జున కామెంట్స్ వైర‌ల్
nagarjuna

న‌ట సామ్రాట్ నాగార్జున (Nagarjuna) చాల‌కాలం త‌ర్వాత ఓ స‌క్సెస్ చూశారు. సంక్రాంతి సంద‌ర్భంగా నిన్న (14.01.2024) విడుద‌లైన నా సామిరంగా (Naa Saami Ranga) చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజ‌య‌వంతంగా న‌డుస్తుండ‌డంతో అభిమానులు కూడా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో మాట‌ల మ‌ధ్య మాల్దీవ్స్ ప‌ర్య‌ట‌న గురించి చెప్పిన మాట‌లు సోష‌ల్‌ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇటీవ‌ల బిగ్‌బాస్‌, ఎక‌ధాటిగా జ‌రిగిన నా సామిరంగ చిత్రాల షూటింగ్ త‌ర్వాత విశ్రాంతి తీసుకోవాల‌నుకున్న కింగ్ నాగ్(Nagarjuna) నెల రోజుల క్రిత‌మే ఫ్యామిలీతో మాల్దీవ్స్ ప‌ర్య‌ట‌న‌కు ఫ్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ లోపు అక్క‌డి ప్ర‌భుత్వంలోని మంత్రులు మ‌న దేశంపై, ప్ర‌ధాని మోదీపై అస‌భ్య‌క‌రంగా మాట్లాడంతో మ‌న దేశవ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేఖ‌త వ్య‌క్త‌మైంది. అదే స‌మ‌యంలో చాలా మంది సెల‌బ్రిటీలు, సాధార‌ణ పౌరులు ఘాటుగా స్పందించ‌డంతో సోష‌ల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్( Boycott Maldives) నినాదం ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. అదేవిధంగా మాల్దీవ్స్‌కు బ‌దులు ల‌క్ష్య‌ద్వీప్‌(Lakshadweep)కు వెళ్లాల‌ని ప్ర‌ధాని కూడా కోర‌డంతో చాలా మంది అక్క‌డికి వెళ్ల‌డానికి ఫ్లాన్ చేసుకుంటున్నారు.


ఈ క్ర‌మంలో ఓ మీడియా ఇంట‌ర్య్వూలో నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ మాల్దివ్స్ చేసిన ప‌ని ఏమాత్రం స‌హించ‌ద‌గిన‌ది కాద‌ని మ‌న ప్ర‌ధానిపై వారు చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లను ఖండిస్తున్నాన‌న్నారు. సంక్రాంతి పండుగ అయ్యాక 17,18 తేదీల‌లో నాకు చాలా ఇష్ట‌మైన మాల్దీవ్స్‌(Maldives)కు వెళ్లాల‌నుకున్నా, ఇప్ప‌టికి చాలాసార్లు వెళ్లాన‌ని కానీ ఇప్పుడు నా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నానని త్వ‌ర‌లో ల‌క్ష్య‌ద్వీప్‌(Lakshadweep)కు వెళ‌తాన‌న్నారు. అలాగే ఇక‌పై మ‌న‌మంతా అక్క‌డికే వెళ్లాల‌ని సూచించారు. దీంతో నాగార్జున (Nagarjuna) తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లు వెత్తుతున్నాయి.

Updated Date - Jan 15 , 2024 | 09:39 AM